iDreamPost
android-app
ios-app

15 లక్షలు నష్టపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. అసలు ఏం జరిగిందంటే?

  • Published May 21, 2024 | 8:40 PM Updated Updated May 21, 2024 | 8:40 PM

Bigg Boss Beauty Faces 15 Lakh Lose: బిగ్ బాస్ బ్యూటీకి చేధు అనుభవం ఎదురైంది. ఏకంగా ఆమె 15 లక్షల రూపాయలు కోల్పోయింది. ఆ విషయాన్ని, తన ఆవేదను నెట్టింట పోస్ట్ రూపంలో పెట్టింది.

Bigg Boss Beauty Faces 15 Lakh Lose: బిగ్ బాస్ బ్యూటీకి చేధు అనుభవం ఎదురైంది. ఏకంగా ఆమె 15 లక్షల రూపాయలు కోల్పోయింది. ఆ విషయాన్ని, తన ఆవేదను నెట్టింట పోస్ట్ రూపంలో పెట్టింది.

  • Published May 21, 2024 | 8:40 PMUpdated May 21, 2024 | 8:40 PM
15 లక్షలు నష్టపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. అసలు ఏం జరిగిందంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ భాషలో అయినా సూపర్ సక్సెస్ అయిన షో ఇంది. ఈ షోలో పాల్గొన్న తర్వాత ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా పెరుగుతుంది. అలాగే స్టార్ యాక్టర్స్ కు సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఈ షో ఉపయోగపడుతుంది. అలాగే ఒక బాలీవుడ్ భామ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మరోసారి తెగులు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆమె మొదటి వారమే ఎలిమినేట్ అయ్యిపోయింది. ఇప్పుడు ఆ భామ నెట్టింట తాను రూ.15 లక్షలు నష్టపోయాను అంటూ తన ఆవేదనను వెళ్లగక్కింది. అసలు ఏంమైందంటే?

ఆ బిగ్ బాస్ బ్యూటీ మరెవరో కాదు.. కిరణ్ రాథోర్. ఈ అమ్మడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ, ఆమె మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించినా కూడా టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కొన్నాళ్లకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇప్పుడు ఒక షాకింగ్ పోస్ట్ చేసింది.

అదేంటంటే.. ఆమె ఏకంగా రూ.15 లక్షలు నష్టపోయిందంట. ఆ విషాన్ని తెలియజేస్తూ.. ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏం జరిగిందంటే.. ప్రస్తుతంత ఫ్రాన్స్ లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. అయితే కిరణ్ రాథోర్ కూడా అక్కడు వెళ్లాల్సి ఉందంట. ఇప్పటికే తన టీమ్ మొత్తం అక్కడికి వెళ్లిపోయింది. తాను కూడా మే 13నే ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉంది. తనకు వీసా కోసం గతనెలే అప్లయ్ కూడా చేసిందంట. కానీ, ఇప్పటికీ ఇంకా వీసా రాలేదు. అక్కడ హోటల్ బుకింగ్స్, ట్రావెల్ బుకింగ్స్ అన్నీ చేసేసుకుంది. అందుకోసం ఏకంగా రూ.15 లక్షలు ఖర్చు చేసింది. ఇంకా వీసా రాకపోవడంతో.. కిరణ్ రాథోర్ మానసికంగా కూడా తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు వెల్లడించింది.

 

View this post on Instagram

 

A post shared by Keira Rathore (@kiran_rathore_official)

తన ఆవేదనను వెల్లిబుచ్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు ఎదురైన ఈ ఘటనకు సంబంధించి సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ప్రస్తుతం కిరణ్ రాథోర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంసంగా మారింది. చాలామంది కిరణ్ కు ఎదురైన ఈ సంఘటన చూసి షాకవుతున్నారు. అసలు ఎందుకు అలా వీసా ఇవ్వలేదు కారణం అయినా చెప్పారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. సామాన్యులు విదేశాలకు వెళ్లాలంటే ఇంకా కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కిరణ్ రాథోర్ కి ఇప్పటికైనా వీసా వస్తుందేమో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Keira Rathore (@kiran_rathore_official)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş