iDreamPost
android-app
ios-app

పూజా హెగ్డేని వదలని త్రివిక్రమ్.. సినిమా కోసం అలా వాడేస్తున్నారట?

  • Author ajaykrishna Published - 12:10 PM, Mon - 10 July 23
  • Author ajaykrishna Published - 12:10 PM, Mon - 10 July 23
పూజా హెగ్డేని వదలని త్రివిక్రమ్.. సినిమా కోసం అలా వాడేస్తున్నారట?

ప్రస్తుతం ఫామ్ లో ఉన్న టాలీవుడ్ అగ్రదర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఓవైపు తన డైరెక్షన్ లో సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరోవైపు ఇతర సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. దాదాపు ఇరవై ఏళ్లకు పైనే ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రివిక్రమ్.. రచయితగా తనకంటూ ప్రత్యేక శైలిని, గుర్తింపును సంపాదించుకున్నాడు. అరవింద సమేత, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న ఆయన.. ప్రెజెంట్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఆల్రెడీ ఫ్యాన్స్ లో మినిమమ్ అంచనాలు సెట్ అయిపోయాయి.

ఇదిలా ఉండగా.. గుంటూరు కారం మూవీలో మొదటగా పూజా హెగ్డేని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఏమైందో గాని.. మూవీ నుండి పూజా తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా ప్రకటించారు మేకర్స్. అయితే.. త్రివిక్రమ్ తీసిన చివరి రెండు సినిమాలలో పూజానే హీరోయిన్. మరి ఎందుకు గుంటూరు కారం నుండి తప్పుకుందో తెలియదు. కానీ.. ఆల్రెడీ నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ పూజ దగ్గర ఉండిపోయిందట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ టీమ్ ఓ మాస్టర్ ప్లాన్ వేసిందట. ఎలాగో పూజ వద్ద అడ్వాన్స్ ఉంది కాబట్టి.. ఈ సినిమాలో పూజతో ఐటమ్ సాంగ్ చేయించాలని ఆలోచన చేస్తున్నారట.

ఇక ఈపాటికి రిలీజ్ దగ్గర పడాల్సిన గుంటూరు కారం మూవీకి మొదటి నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే.. రీసెంట్ గా మూవీ నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పుకోవచ్చు. అయితే.. పూజా హెగ్డే విషయానికి వస్తే.. త్రివిక్రమ్ తో ఆమె కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అనిపించింది. సో.. ఇదివరకు బాగా వర్కౌట్ అయింది. కాబట్టి.. ఇచ్చిన అడ్వాన్స్ తో పూజని ఐటమ్ సాంగ్ కోసం వాడుకోనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ విషయం తెలిసి.. మొత్తానికి మాటల మాంత్రికుడు ఎలాగోలా పూజాని చూపించాలని ఫిక్స్ అయిపోయాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి గుంటూరు కారంలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ కి ఫిక్స్ అయ్యిందా లేదా తెలియాల్సి ఉంది. మరి పూజా – త్రివిక్రమ్ కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş