iDreamPost
android-app
ios-app

స్టార్ హీరోకు ప్రమాదం.. సినిమా రిలీజ్‌కు ముందు

  • Published Sep 11, 2024 | 2:52 PM Updated Updated Sep 11, 2024 | 2:58 PM

ప్రముఖ కన్నడ నటుడు కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సెప్టెంబర్ 12న ఆయన నటించిన రోని మూవీ రిలీజ్‌ అవుతుండగా.. ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ప్రముఖ కన్నడ నటుడు కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సెప్టెంబర్ 12న ఆయన నటించిన రోని మూవీ రిలీజ్‌ అవుతుండగా.. ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

  • Published Sep 11, 2024 | 2:52 PMUpdated Sep 11, 2024 | 2:58 PM
స్టార్ హీరోకు ప్రమాదం.. సినిమా రిలీజ్‌కు ముందు

ప్రముఖ కన్నడ నటుడు కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కెంగేరి రోడ్డులో ఆయన కారు డివైడర్‌ను ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికలు వెంటనే కెంగెరి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. సెప్టెంబర్ 12న ఆయన నటించిన రోనీ మూవీ రిలీజ్‌ ఉండగా.. ఈ ఈ యాక్సిడెంట్ చోటుచేసుకోసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ జంతువు (ముంగిస) తప్పించబోయి వాహనం డివైడర్‌ను గుద్దినట్లు కన్నడ మీడియా పేర్కొంటోంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఛాతీకి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో ఆరోగ్య పరిస్థితి నలకడగా ఉందని తెలుస్తుంది.

ఈ ఘటనలో హీరోతో పాటు తన అప్ కమింగ్ మూవీ నిర్మాత కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం గురించి నిర్మాత గిరీష్ హెగ్డే మీడియాకు వెళ్లడించారు. ‘రోనీ సినిమా స్క్రీనింగ్ తర్వాత కిరణ్ రాజ్ ముద్దినపాళ్యలోని ఓ అనాథాశ్రమానికి వెళ్లాం. అనాథ శరణాలయం నుంచి తిరిగి వస్తున్నప్పుడు నేను కారు నడుపుతున్నాను. కొంచెం చీకటిగా ఉంది. నేను ముంగిసను చూడగానే, దాన్ని తప్పించడానికి కుడి వైపుకు తిప్పాను. ఈ సమయంలో కారు డివైడర్ తాకింది. వెంటనే కిరణ్ రాజ్‌ని దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించాం. నటుడి ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు’ అని కన్నడ చిత్రం రోనీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత గిరీష్ హెగ్డే మీడియాకు తెలిపారు.

కాగా, కిరణ్ రాజ్ ప్రమాదం బారిన పడ్డారని తెలియగానే ఆందోళన చెందారు అభిమానులు. ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. ఆయకు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలియగానే ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. కిరణ్ సినిమా రోనీ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా.. ఈ ప్రమాదానికి గురయ్యాడు. గురుతేజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాధ్యా, సమీక్ష, రవిశంకర్, బి సురేష్, అపూర్వ, ఉగ్రం మంజు, నటించారు. రవి, యష్ శెట్టి, ధర్మన్న, గిరీష్ హెగ్డే, కారి సుబ్బు, మైకో నాగరాజ్ కీలక పాత్రలు పోషించారు. కిరణ్ రాజ్ కెరీర్ విషయానికి వస్తే.. స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టాడు. హిందీ షోలలో కూడా నటించారు. తన షో ‘కన్నడతి’ తర్వాత ‘రాణి’ అనే మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేయగా ..అది త్వరలో విడుదల కానుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş