iDreamPost
android-app
ios-app

తండ్రితో లిప్ లాక్! వివాదంపై నోరువిప్పిన హీరోయిన్!

  • Author ajaykrishna Updated - 03:42 PM, Tue - 12 September 23
  • Author ajaykrishna Updated - 03:42 PM, Tue - 12 September 23
తండ్రితో లిప్ లాక్! వివాదంపై నోరువిప్పిన హీరోయిన్!

ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటే బాలీవుడ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ సినిమాలకంటే కూడా ఎక్కువ హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ గురించి వార్తలు వినిపిస్తుంటాయి. ముప్పై ఏళ్ళ క్రితం.. సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్, తన కూతురు హీరోయిన్ పూజా భట్ తో లిప్ లాక్ కాంట్రవర్సీలో భాగమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తెరపైకి తీసుకురావడంలో భట్ ఫ్యామిలీ ముందుంటుంది. మహేష్ భట్ దర్శకనిర్మాతగా ఎంత సక్సెస్ చూసారో.. అదే రేంజ్ లో వివాదాలలో కంటిన్యూ అవుతున్నారు. ఆయనతో పాటు కూతుళ్లు పూజా భట్, అలియా భట్ లను కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

పదిహేడేళ్ల వయసులోనే హీరోయిన్ గా తెరపై మెరిసిన పూజా భట్.. తండ్రి మహేష్ భట్ తో కలిసి లిప్ లాక్ పెట్టిన ఫోటోలు అప్పట్లో సంచలనం రేపాయి. అసలు తండ్రీకూతురు పెదవి ముద్దు పెట్టుకోవడం ఏంటి.. దాన్ని మళ్లీ ఫోటోషూట్ చేసి ప్రచారం చేసుకోవడం ఏంటని పెద్ద రచ్చే జరిగింది. దీంతో మహేష్ భట్ ని, పూజాలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ.. విమర్శిస్తూ వచ్చారు జనాలు. కట్ చేస్తే.. అదే లిప్ లాక్ వివాదం ముప్పై ఏళ్లు దాటినా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూనే ఉంది. కాగా.. తండ్రితో లిప్ లాక్ ఏంటని పూజాను దారుణంగా కామెంట్స్ కూడా చేసినట్లు పలు సందర్భాలలో చెప్పింది.

ఇక ఇప్పుడు తాజాగా లిప్ లాక్ వివాదంపై స్పందించింది పూజా భట్. 17 ఏళ్లకే హీరోయిన్ అయిన ఈ భామ.. పదేళ్లు సినిమాలు చేసి.. ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయిపోయింది. మళ్లీ రీసెంట్ గా నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బోల్డ్ క్యారెక్టర్స్ తో ఇప్పటికి బోల్డ్ బ్యూటీగానే కంటిన్యూ అవుతోంది. అయితే.. తండ్రి మహేష్ భట్ తో లిప్ కిస్ పై స్పందిస్తూ.. “తండ్రితో లిప్ కిస్ ఏంటని అప్పట్లో నన్ను ఘోరంగా కామెంట్ చేశారు. అయితే.. ఒక్క విషయం తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎప్పుడూ చిన్న పిల్లలే. నా తండ్రికి నాకు మధ్య ఆ ఉద్దేశంతోనే లిప్ కిస్ జరిగింది తప్ప వేరే ఏం లేదు. దీని గురించి ఎన్ని విమర్శలు ఎదురైనా పెద్దగా పట్టించుకోలేదు.” అని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. మరి పూజా భట్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş