iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ భార్యపై మరో కేసు..ఎందుకంటే?

  • Published Sep 21, 2024 | 10:29 AM Updated Updated Sep 21, 2024 | 4:06 PM

Jani Master wife Ayesha: ఇప్పటికే జానీ మాస్టర్ కు అత్యాచార కేసులో కోర్టు 14 రోజులు రిమాండ్ ను విధించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో జానీ మాస్టర్ కేసులో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా జానీ మాస్టర్ భార్యపై మరో కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Jani Master wife Ayesha: ఇప్పటికే జానీ మాస్టర్ కు అత్యాచార కేసులో కోర్టు 14 రోజులు రిమాండ్ ను విధించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో జానీ మాస్టర్ కేసులో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా జానీ మాస్టర్ భార్యపై మరో కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

  • Published Sep 21, 2024 | 10:29 AMUpdated Sep 21, 2024 | 4:06 PM
జానీ మాస్టర్ భార్యపై మరో కేసు..ఎందుకంటే?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది. ఆయనపై ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, అలానే అత్యాచారం చేసినట్లు సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ కు తీసుకొచ్చి.. ఉప్పరపల్లి కోర్టులో హాజర పరిచారు. ఈ క్రమంలోనే కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో జానీని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇది ఇలా ఉంటే.. ఇష్యూలో జానీ మాస్టర్ భార్యపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

జానీ మాస్టర్ భార్య ఆయేషాపై భార్య పై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. కొన్నిరోజుల క్రితం జానీ మాస్టర్ కేసులో బాధితురాలు మొదట ఆయన భార్య ఆయేషాపై కూడా పోలీసులకు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలుకు మతం మారి తన భర్తను పెళ్లిచేసుకోవాలని, అయేషా వేధించేదని, పలు మార్లు దాడి కూడా చేసి, బెదిరించేదని సదరు యువతి నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది. అయితే తాజాగా మరోసారి ఆయేషా పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జానీ భార్య ఆయేషా తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం. ఈ కారణంతోనే జానీ మాస్టర్ భార్యపై మరో కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు జానీ మాస్టర్ ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసేందుకు కూడా పోలీసులు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే.. జానీ మాస్టర్ ఇష్యూలో అతడి భార్య ఆయేషా కూడా వార్తల్లో నిలించింది. ఇక జానీ మాస్టర్ భార్య.. ఓ మీడియా ఛానల్ లో మాట్లాడుతూ.. సంచలన కామెంట్స్ చేసింది. 16 ఏళ్ల వయసులో రేప్ చేశాడని ఆ అమ్మాయి అంటుంది. దీనిక ఫ్రూఫ్ ఏంటీ అని ఆయేషా ప్రశ్నించింది. ఇన్నేళ్లుగా ఎందుకు బయటకు రాలేదు. ఇప్పుడు ఎందుకు లైంగిక ఆరోపణలు చేస్తుందని ఆమె ప్రశ్నించింది. ఇది తప్పుడు కేసు అని, కానీ పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవల్ లో సత్తా చాటుతున్నారని, కొందరు ఓర్వలేకనే తొక్కేయాలని చూస్తున్నారు అని తెలిపింది.

ముఖ్యంగా జానీ మాస్టర్ ఆ అమ్మాయికి చేసిన మంచి.. ఈ రోజు శాపంగా మారిందని తెలిపింది. జానీ మాస్టర్ విషయంలో పెద్ద కుట్ర జరుగుతుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా జానీ మాస్టర్ వివాదంలో ఆయన కంటే ఎక్కువ ఆయేషా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక జానీ మాస్టర్ విషయానికి వస్తే..ఆయన ప్రస్తుతం చంచలగూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మొత్తంగా జానీ మాస్టర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. మరి.. జానీ మాస్టర్ భార్యపై మరో ఫిర్యాదు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş