iDreamPost
android-app
ios-app

టికెట్స్ విషయంలో పేకమేడలు టీమ్ మరో బంపర్ ఆఫర్

  • Published Jul 23, 2024 | 3:37 PM Updated Updated Jul 23, 2024 | 3:37 PM

Pekamedalu Movie New Ticket Offer : రీసెంట్ గా రిలీజ్ అయ్యి.. డీసెంట్ హిట్ టాక్ సంపాదించుకుంటున్న మూవీ.. "పేక మేడలు". ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేయడమే కాకుండా కేవలం రూ.50 లకే టికెట్స్ ను కూడా సోల్డ్ చేశారు. ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Pekamedalu Movie New Ticket Offer : రీసెంట్ గా రిలీజ్ అయ్యి.. డీసెంట్ హిట్ టాక్ సంపాదించుకుంటున్న మూవీ.. "పేక మేడలు". ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేయడమే కాకుండా కేవలం రూ.50 లకే టికెట్స్ ను కూడా సోల్డ్ చేశారు. ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 23, 2024 | 3:37 PMUpdated Jul 23, 2024 | 3:37 PM
టికెట్స్ విషయంలో పేకమేడలు టీమ్ మరో బంపర్ ఆఫర్

కొన్నాళ్లుగా టాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా.. చిన్న బడ్జెట్ సినిమాలే.. భారీ హిట్స్ అందుకుంటున్నాయి. బడ్జెట్ తో సంబంధం లేకుండా.. కథను బలంగా నమ్మి థియేటర్స్ లో అడుగుపెడుతున్న సినిమాలకు .. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు వాటి మార్క్ ను చూపించాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయింది. ఈ సినిమా మరేదో కాదు రీసెంట్ గా రిలీజ్ అయ్యి.. డీసెంట్ హిట్ టాక్ సంపాదించుకుంటున్న మూవీ.. “పేక మేడలు”. జూలై 19 న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆల్రెడీ రూ.50 లకే టికెట్స్ ను సోల్డ్ చేసిన చిత్ర బృందం మరొక ఇంట్రెస్టింగ్ ఆఫర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

పేక మేడలు మూవీకి నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటినుంచి కూడా పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంది. ఇక దానితో పాటు మూవీ ప్రమోషన్స్ సమయంలో.. కేవలం రూ.50 టికెట్ అని చెప్పడంతో.. ఇంకాస్త వైరల్ అయింది. ఒక మూవీ చూడాలంటే కనీసం ధర రూ.300 ఉంటుంది. అలాంటిది రూ.50 లకే టికెట్ అనడంతో.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. ఇక రిలీజ్ తర్వాత.. ప్రతి చోట ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఏ నడిచింది. దాదాపు అందరు పాజిటివ్ రివ్యూస్ ఏ ఇచ్చారు. ప్రస్తుతం పేకమేడలు మూవీ థియేటర్ లో డీసెంట్ హిట్ టాక్ నే సంపాదించుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ ఆఫర్ తో మూవీ టీం ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. అదేంటంటే.. ఒక టికెట్ కొంటె మరొక టికెట్ ఫ్రీ అయితే ఈ ఆఫర్ ఆంధ్రా , తెలంగాణాలో కేవలం మంగళవారం , బుధవారం , గురువారం మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.

కాబట్టి ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడకపోతే కనుక.. ఈ ఆఫర్ ను ఉపయోగించుకుని వెంటనే చూసేయండి. ఇక సినిమా విషయానికొస్తే.. ఉమన్ ఎంపవర్మంట్ చుట్టూ తిరిగే కథ ఇది. చాలా మంది ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారని చెప్పి తీరాలి. కాగా ఈ సినిమాలో తమిళ నటుడు వినోద్ కిషన్, కన్నడ హీరోయిన్ అనూష కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించగా.. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ సంస్థ బ్యానర్ పై నటుడు రాకేష్ వర్రే నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం.. థియేటర్స్ లో చిన్న సినిమాల సత్తా ఏంటో చూపిస్తుంది. మరి ఈసారి పేకమేడలు మూవీ టీం ప్రకటించిన ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss