iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కల్కి కోసం ప్రసాద్ ఐమాక్స్‌లో కొత్త మెరుగులు.. కొన్ని రోజులు గ్యాప్ తప్పదు!

  • Published May 30, 2024 | 7:04 PM Updated Updated May 30, 2024 | 7:04 PM

PCX Screen Closed For 3 Weeks: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ ని మూడు వారాల పాటు క్లోజ్ చేస్తున్నట్లు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం వెల్లడించింది. కల్కి సినిమా రిలీజ్ అయ్యే నాటికి స్క్రీన్ ని కొన్ని మాడిఫికేషన్స్ చేస్తున్నట్లు తెలిపింది.

PCX Screen Closed For 3 Weeks: ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ ని మూడు వారాల పాటు క్లోజ్ చేస్తున్నట్లు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం వెల్లడించింది. కల్కి సినిమా రిలీజ్ అయ్యే నాటికి స్క్రీన్ ని కొన్ని మాడిఫికేషన్స్ చేస్తున్నట్లు తెలిపింది.

ప్రభాస్ కల్కి కోసం ప్రసాద్ ఐమాక్స్‌లో కొత్త మెరుగులు.. కొన్ని రోజులు గ్యాప్ తప్పదు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వడమే లేటు.. థియేటర్స్ దద్దరిల్లిపోయేలా రచ్చ రచ్చ చేయడానికి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే కల్కి విడుదల సమయానికి ప్రసాద్ ఐమాక్స్ లో కొత్త మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్.. దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ గా ఉంది. ఐమాక్స్ స్క్రీన్ ని ప్రస్తుతం పీసీఎక్స్ స్క్రీన్ అని పిలుస్తున్నారు. అయితే ఈ స్క్రీన్ ని కొన్ని రోజుల పాటు క్లోజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం వెల్లడించింది. ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం వెల్లడించింది.

జూన్ 3 నుంచి జూన్ 26 వరకూ పీసీఎక్స్ స్క్రీన్ ని (ఐమాక్స్) తాత్కాలికంగా మూసివేస్తున్నామని తెలిపారు. ప్రేక్షకులకు సినిమా చూసేందుకు మంచి అనుభూతి కోసం, కూర్చునే సీట్ల విషయంలో మరింత సౌకర్యాన్ని కల్పించడం కోసం థియేటర్ ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. మళ్ళీ కల్కి 2898 ఏడీ సినిమాతోనే థియేటర్ తెరుచుకుంటుందని పేర్కొంది. మీ కోసం పీసీఎక్స్ స్క్రీన్ కి కొత్త మెరుగులు దిద్దుతున్నామని.. జూన్ 27న కల్కి సినిమాతో ఆ మ్యాజిక్ ని ఆస్వాదించండి అంటూ ప్రకటన చేసింది. ప్రేక్షకుల కోసం, ప్రేక్షకుల సౌకర్యం కోసం సీట్లు, ఫ్లోర్ కార్పెట్లు మారుస్తున్నట్లు తెలిపారు. అందుకే జూన్ 3 నుంచి పీసీఎక్స్ స్క్రీన్ ని మూసివేస్తున్నట్లు తెలిపారు.

కల్కి సినిమా రిలీజ్ సమయానికి స్క్రీన్ రెడీ అవుతుందని.. ఆరోజే ఓపెన్ అవుతుందని మేనేజర్ టెక్నికల్ ఆపరేషన్స్ పర్సన్ మోహన్ కుమార్ తెలిపారు. దీంతో 24 రోజుల పాటు ప్రసాద్ స్క్రీన్ లో బొమ్మ ఆడదు. ప్రేక్షకులకు, మూవీ లవర్స్ కి ఒక మంచి అనుభూతిని ఇవ్వడం కోసం.. కల్కి సినిమా విడుదల నాటికి సిద్ధం చేస్తున్నట్లు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యం తెలిపింది. మరి ప్రభాస్ కల్కి సినిమా కోసం కూడా ఆలోచించి సాంకేతికపరమైన అప్ డేట్స్ ఏమైనా చేస్తున్నారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ గా ఉన్న పీసీఎక్స్ స్క్రీన్ 64×101.6 అడుగుల భారీ పరిమాణంలో 630 సీట్ల సామర్థ్యంతో ఉంది. మరి కల్కి రిలీజ్ నాటికి ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్ ని అప్డేట్ చేస్తున్న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యాజమాన్యంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.