iDreamPost
android-app
ios-app

నెటిజన్ అసభ్యకర కామెంట్.. డేరింగ్ రిప్లై ఇచ్చిన పాయల్!

  • Author Soma Sekhar Updated - 12:57 PM, Tue - 28 November 23

ఓ నెటిజన్ తన లో దుస్తులపై అసభ్యకర కామెంట్ చేయగా.. హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ డేరింగ్ రిప్లై ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించుకుంది.

ఓ నెటిజన్ తన లో దుస్తులపై అసభ్యకర కామెంట్ చేయగా.. హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ డేరింగ్ రిప్లై ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించుకుంది.

  • Author Soma Sekhar Updated - 12:57 PM, Tue - 28 November 23
నెటిజన్ అసభ్యకర కామెంట్.. డేరింగ్ రిప్లై ఇచ్చిన పాయల్!

సోషల్ మీడియా వాడకం పెరిగాక సెలబ్రిటీలపై విమర్శలు, ట్రోలింగ్ లు కూడా విపరీతంగా పెరిగాయి. సినిమా విషయాలే కాకుండా కొన్ని కొన్ని సార్లు పర్సనల్ లైఫ్ విషయాలను కూడా టార్గెట్ చేస్తున్నారు కొందరు ఆకతాయి నెటిజన్లు. అయితే ఇలాంటి వారికి అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తుంటారు సదరు సెలబ్రిటీలు. తాజాగా ఓ నెటిజన్ తన లో దుస్తులపై అసభ్యకర కామెంట్ చేయగా.. హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ డేరింగ్ రిప్లై ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ప్రస్తుతం పాయల్ నటించిన ‘మంగళవారం’ సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది.

పాయల్ రాజ్ పుత్.. ‘RX100’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తొలి మూవీతోనే హాట్ బ్యూటీగా కుర్రాళ్ల మనసు దోచింది. ఈ చిత్రంలో పాయల్ నటనకు, అందాలకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత వరుసగా ఈ అమ్మడికి అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆ సినిమాలు పెద్దగా పేరుతీసుకురాలేదు. ఇక తాజాగా తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి మరోసారి పాయల్ రాజ్ పుత్ కు బిగ్ బ్రేక్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన ‘మంగళవారం’ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది ఈ మూవీ.  అజయ్ భూపతి టేకింగ్ కు, పాయల్ అందాలు, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ నెటిజన్ మంగళవారం సినిమాలోని ఓ సీన్ క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేసి.. చాలా నీచంగా కామెంట్ పెట్టాడు. ఆమె లో దుస్తుల గురించి ఈ పోస్ట్ పెట్టాడు. దీనికి రియాక్ట్ అయ్యింది పాయల్. ఏ మాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆ లో దుస్తులు నావి కావు.. ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చినవి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు సైతం పాయల్ డేరింగ్ ను మెచ్చుకుంటున్నారు. ఆ నెటిజన్ తీరును తప్పుపడుతూ.. వ్యతిరేకిస్తున్నారు. సినిమాని సినిమాగానే చూడాలిగానీ.. ఇలా పర్సనల్ గా చూడొద్దంటూ విమర్శిస్తున్నారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbet