iDreamPost
android-app
ios-app

Pawan Kalyan అబ్బాయి స్టైల్ లో బాబాయ్ ఫైట్

  • Published Apr 11, 2022 | 4:28 PM Updated Updated Apr 11, 2022 | 4:28 PM
  • Published Apr 11, 2022 | 4:28 PMUpdated Apr 11, 2022 | 4:28 PM
Pawan Kalyan అబ్బాయి స్టైల్ లో బాబాయ్ ఫైట్

గత నెల విడుదలై ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రధాన ఆకర్షణల్లో రామ్ చరణ్ ఇంట్రో ఏ రేంజ్ లో పేలిందో అందరికీ గుర్తే. వేల మంది చుట్టూ ఉన్నా సరే వాళ్ళతో కలబడుతూ దెబ్బలు తింటూ రక్తం కారుతున్నా సరే తాను పట్టుకోవాలనుకున్న వాడిని ఆఫీసర్ ముందు పడేసిన రామరాజు ధీరత్వం అత్యుత్తమ పరిచయ సన్నివేశాల్లో ఒకటిగా నిలబడింది. దీనికన్నా ముందు ఇదే రాజమౌళి మగధీరలో చరణ్ తో వంద మందిని ఒకేసారి చంపించిన ఎపిసోడ్ ఇప్పుడు చూసినా గూస్ బంప్స్ వస్తాయి. చేసిన పదమూడు సినిమాల్లో మెగా పవర్ స్టార్ కి ఇవే బెస్ట్ ఎపిసోడ్స్ అని బల్లగుద్ది చెప్పొచ్చు

ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఇదే తరహాలో చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ఒక ఎపిసోడ్ ఉండబోతోందట. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న హరిహర వీరమల్లులో హీరో పాత్ర ఒకేసారి వెయ్యి మందితో ఫైట్ చేసే బ్లాక్ ఒకటి ఉందట. దీనికోసమే పవన్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ పాల్గొనబోతున్నట్టు తెలిసింది. మొన్న రిలీజ్ చేసిన వీడియో తాలూకు ట్రైనింగ్ దీని గురించేనని సమాచారం. మాములుగా ఓ గుంపుని కొడితేనే పవన్ ఫ్యాన్స్ థియేటర్లో ఓ రేంజ్ లో ఊగిపోతారు. అలాంటిది ఒకేసారి వందల మందిని కర్రసాముతో ఎదురుకుంటే ఆ ఊహకే అభిమానులు వెర్రెత్తిపోతారేమో

భీమ్లా నాయక్ కోసం బ్రేక్ తీసుకున్న హరిహర వీరమల్లు ఇకపై నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోనుంది. ఇంకా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనప్పటికీ వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రణాళికలో ఉన్నారు దర్శకులు క్రిష్. ఇది కాకుండా పవన్ వినోదయ సితం రీమేక్ తో పాటు హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2024లో జరగబోయే ఎలక్షన్స్ కోసం వచ్చే ఏడాది నుంచే హడావిడి మొదలయ్యే ఛాన్స్ ఉంది కనక ఆలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేలా పవర్ స్టార్ ప్లాన్ చేసుకుంటున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న హరిహర వీరమల్లుకి కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom