iDreamPost
android-app
ios-app

యాదమ్మ రాజు హెల్త్ అప్ డేట్.. వేలు తీసేసిన వైద్యులు!

  • Published Jul 29, 2023 | 7:18 PM Updated Updated Jul 29, 2023 | 7:18 PM
  • Published Jul 29, 2023 | 7:18 PMUpdated Jul 29, 2023 | 7:18 PM
యాదమ్మ రాజు హెల్త్ అప్ డేట్.. వేలు తీసేసిన వైద్యులు!

యాదమ్మ రాజు.. పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఒక మంచి కమెడియన్ గా ఎదిగాడు. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా మారాడు. గతేడాది డిసెంబర్ లో తాను ప్రేమించిన స్టెల్లాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అటు షోలు, ఇటు యూట్యూబ్, ఇన్ స్టా రీల్స్ అంటూ కపుల్స్ ఇద్దరూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. అప్పటివరకు అంతా బాగానే ఉంది. ఇటీవల యాదమ్మ రాజుకు ప్రమాదం జరగడంతో వాళ్లు లైఫ్ లో ఒకింత గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్ కూడా ఏమైంది అంటూ కంగారు పడ్డారు.

అయితే యాదమ్మ రాజుకు జరిగిన ప్రమాదం గురించి ఇప్పటికే స్టెల్లా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? తర్వాత అతని హెల్త్ ఎలా ఉంది అంటూ మొత్తం చెప్పుకొచ్చింది. తాజాగా యాదమ్మ రాజు కూడా స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రమోషన్స్ లో కూడా తన హెల్త్ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. అసలు అతనికి ప్రమాదం ఎలా జరిగింది అంటే.. ఓ రోజు సాయంత్రం కార్ పార్క్ చేసి ఇంటి దగ్గర నిల్చొని ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి బైక్ నడుపుతూ స్కిడ్ అయి పడిపోయాడు. అతను ఢీకొట్టడంతో యాదమ్మ రాజుకు కాలి వేలు పైన చర్మం మొత్తం ఊడిపోయింది. వీళ్లు కంగారుగా ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆ వేలులో సెల్స్ యాక్టివ్ గా లేవని.. తిరిగి అతికించడం కుదరని చెప్పారంట. తర్వాత ఎక్స్ రే తీసి వైద్యులు పరిశీలించారు. ఎముకకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చారు. కేవలం చిన్న చిన్న క్రాక్స్ మాత్రమే వచ్చాయన్నారు.

తాజాగా యాదమ్మ రాజు మాట్లాడుతూ.. తన కాలి వేలు తీసేశారని చెప్పాడు. చిటికన వేలు పక్కనున్న వేలును సగానికి కట్ చేసి తీసేసినట్లు తెలిపాడు. తొడ మీద ఉన్న స్కిన్ ని తీసి ఆ వేలుకు అతికించారని చెప్పాడు. దాని పక్కన వేలుకు కుట్లు పడినట్లు తెలిపాడు. తాను అంత బాధలో ఉన్నా కూడా తను నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రమోషన్స్ కోసం వెళ్లాడు. వర్షాలు పడుతున్నా.. కాలు నడవనివ్వకపోతున్నా యాదమ్మ రాజు మాత్రం అంత డెడికేషన్ తో ప్రమోషన్స్ కు వెళ్లడంపై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక నిజమైన ఆర్టిస్ట్ అంటే అలాగే ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. నమ్ముకున్న సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఎంత కష్టాన్ని అయినా యాదమ్మ రాజులాగా భరించాలి అంటూ పొగిడేస్తున్నారు. యాదమ్మ రాజు త్వరగా కోలుకుని తమని మళ్లీ ఎప్పటిలాగానే ఎంటర్ టైన్ చేయాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss