iDreamPost
android-app
ios-app

Parineeti Chopra : ఇన్నేళ్ల తర్వాత  పరిణితి టాలీవుడ్ డెబ్యూ

  • Published Feb 23, 2022 | 4:19 PM Updated Updated Feb 24, 2022 | 3:53 PM
Parineeti Chopra : ఇన్నేళ్ల తర్వాత  పరిణితి టాలీవుడ్ డెబ్యూ

ఎనర్జిటిక్ హీరో రామ్ తో దర్శకుడు బోయపాటి శీను కాంబోని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా రూపొందే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. పుష్ప దెబ్బకు ఇప్పుడు అందరు హీరోలు దర్శకులు మల్టీ లాంగ్వేజ్ ని మాండేటరీ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా హీరోయిన్లను తీసుకుంటున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లో పరిణితి చోప్రాని తీసుకునే ఆలోచన జరుగుతున్నట్టుగా ఆమేరకు ఆమె వద్దకు ప్రతిపాదన కూడా వెళ్లిపోయిందని ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక అనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా లీక్ గానే తీసుకోవాలి.

పరిణితి చోప్రా బాలీవుడ్ కు వచ్చి 11 ఏళ్ళు అయ్యింది. మరీ టాప్ రేంజ్ కు చేరుకోకపోయినా ఉన్నంతలో తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టిన సినిమాలు ఇషక్ జాదే లాంటివి చాలానే ఉన్నాయి. అప్పట్లో టాలీవుడ్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు కొందరు చేశారు కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా ఇప్పుడు ఇటు వైపుగా అడుగులు పడుతున్నాయి. ఒకవేళ రామ్ తో కనక లాక్ అయితే ఇక్కడ మంచి అవకాశాలు ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అఖండ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అంచనాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా బోయపాటి శీను పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్టుగా వినికిడి. ఏ జానర్ అనేది ఇంకా బయటికి రావాలి.

ఇక రామ్ సంగతి చూస్తే ప్రస్తుతం తను ది వారియర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రామ్ పోలీస్ ఆఫీసర్ తో పాటు డాక్టర్ గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఖాకీ దుస్తుల్లో రిలీజ్ చేశారు. కృతి శెట్టి హీరోయిన్ కావడంతో ఆకర్షణ పెరిగింది. మాస్ ఎంటర్ టైనర్స్ డీల్ చేయడంలో మంచి పేరున్న లింగుస్వామి రామ్ కు పూరి ఇస్మార్ట్ శంకర్ ని మించిన హిట్ ఇస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు.  ది వారియర్ రిలీజ్ ని దసరా లేదా దీపావళికి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. డేట్ ఫైనల్ చేయలేదు

Also Read : Sukumar : అభిమానుల ఆనందం ఆవిరి చేశారే

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş