iDreamPost
android-app
ios-app

Sukumar : అభిమానుల ఆనందం ఆవిరి చేశారే

  • Published Feb 23, 2022 | 3:56 PM Updated Updated Feb 24, 2022 | 3:53 PM
  • Published Feb 23, 2022 | 3:56 PMUpdated Feb 24, 2022 | 3:53 PM
Sukumar : అభిమానుల ఆనందం ఆవిరి చేశారే

నిన్న సాయంత్రం సుకుమార్ తన ఇన్స్ టా పేజీలో మెగాస్టార్ ని డైరెక్ట్ చేయాలనే కల నెరవేరబోతోందని ట్వీట్ చేయడం మెగా ఫ్యాన్స్ కు మాములు కిక్ ఇవ్వలేదు. అసలే రంగస్థలం, పుష్ప బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపుమీదున్న సుక్కు తమ హీరోని ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఏవేవో ఊహించుకున్నారు. కానీ అది కేవలం ఒక యాడ్ షూట్ కోసం మాత్రమే అని సినిమా గురించి కాదని తెలిశాక ఉసూరుమన్నారు. నిజానికి అక్కడ పోస్ట్ లో సుకుమార్ సైతం ఇది వాణిజ్య ప్రకటన కోసమని చెప్పలేదు. జస్ట్ మెగా ఫోన్ ని చేపట్టబోతున్నానని సదరు రియల్ ఎస్టేట్ అధిపతులతో పాటు చిరుకి తానూ బొకే ఇచ్చే ఫోటోని పెట్టారు అంతే.

ఈ మాత్రం దానికి ఇంత దాగుడుమూతలు ఎందుకు అక్కడే క్లారిటీ ఇవ్వొచ్చుగా అనే వాళ్ళు లేకపోలేదు. సస్పెన్స్ మైంటైన్ చేసినందుకే కదా సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ నిజంగా సుకుమార్ చిరంజీవి కాంబో కనక సెట్ అయితే ఆ చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. నిజానికి సుకుమార్ ఇంకో రెండేళ్ల దాకా బిజీ ఉన్నారు. ఈ సంవత్సరం పుష్ప పార్ట్ 2 పూర్తి చేసి తర్వాత ప్రమోషన్లు గట్రా పనుల్లో డిసెంబర్ దాకా లాక్ అయిపోయారు. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సినిమా ఉంది. ఈ రెండూ పూర్తయ్యేలోగా ఈజీగా 2023 దాటిపోతుంది. సో నో ఛాన్స్.

మరోవైపు చిరంజీవి వరసబెట్టి చేస్తున్నవి వేగంగానే జరుగుతున్నాయి కానీ ఇప్పటికిప్పుడు ఆయన కొత్త కమిట్ మెంట్స్ ఇచ్చే స్థితిలో లేరు. ముందు గాడ్ ఫాదర్ అవ్వాలి. ఆ తర్వాత భోళా శంకర్. ఆపై బాబీ డైరెక్షన్ లో వాల్తేర్ వీరయ్య(ప్రచారంలో ఉన్న టైటిల్) ఉన్నాయి. ఇమ్మీడియట్ గా వెంకీ కుడుములు స్క్రిప్ట్ తో సెట్ లోకి దిగిపోతాడు. ఈ లైనప్ కే అందరూ ఆశ్చర్యపోతుంటే కొత్తగా సుకుమార్ కు ఈ గ్యాప్ లో స్పేస్ దొరకడం కష్టం. అందుకే ఆ ఎగ్జైట్మెంట్ క్షణాల్లో ఆవిరైపోయింది. చాలా కాలం తర్వాత యాడ్ కి ఒప్పుకున్న చిరుకి దీని కోసం కోట్లలో భారీ పారితోషికం ముట్టజెప్పారని ఇన్ సైడ్ టాక్. అందుకే సుకుమార్ ని తెచ్చారు

Also Read : Vikramaditya : దర్శక వారసుల సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet