Nidhan
రీరిలీజ్ ట్రెండ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. అయితే అప్పట్లో ఫట్ అయిన మూవీస్ ఇప్పుడు హిట్ అవడం చర్చనీయాంశంగా మారింది.
రీరిలీజ్ ట్రెండ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. అయితే అప్పట్లో ఫట్ అయిన మూవీస్ ఇప్పుడు హిట్ అవడం చర్చనీయాంశంగా మారింది.
Nidhan
తెలుగు నాట ఇప్పుడు రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. గత ఏడాది కాలంలో చాలా పాత సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి. ఎప్పుడో ఆగిపోయిన రీరిలీజ్ ట్రెండ్ మళ్లీ స్టార్ట్ అవడం మంచి విషయమే. ప్రేక్షకులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి, కల్ట్ మూవీస్‌ను బిగ్ స్క్రీన్‌పై ఇంకోసారి ఎంజాయ్ చేయాలనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఇవి ఆయా సినిమాల్లో నటించిన స్టార్ల అభిమానులతో పాటు మూవీ లవర్స్‌కు కూడా నోస్టాల్జిక్ మూమెంట్స్‌ను అందిస్తాయి. అయితే రీరిలీజ్ల్లో ఎక్కువ మటుకు గతంలో సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచిన చిత్రాలే ఉన్నాయి. బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలనే మొదట్లో రీరిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు గతంలో ఫ్లాప్ అయిన ఫిల్మ్స్‌ను కూడా తిరిగి విడుదల చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇవి రీరిలీజ్‌లో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధిస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆరెంజ్’, స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తీసిన ‘ఈ నగరానికి ఏమైంది’తో పాటు సిద్ధార్థ్ ‘ఓయ్’ రీరిలీజ్‌లో సంచలనాలు సృష్టించాయి. ముఖ్యంగా ‘ఈ నగరానికి ఏమైంది’ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. ఐదేళ్ల కింద వచ్చిన ఈ ఫిల్మ్ అప్పట్లో యావరేజ్‌గా నిలిచింది. కానీ రీరిలీజ్‌లో మాత్రం మొదటి రిలీజ్ కంటే భారీగా కలెక్ట్ చేసి లాభాల్లోకి దూసుకెళ్లింది. ఈ సినిమా రీరిలీజ్‌కు అసలు టికెట్లే దొరకలేదు. ఆన్లైన్లో పెట్టగానే అన్నీ బుక్ అయిపోయాయి. ‘ఆరెంజ్’ చిత్రాన్ని కూడా చరణ్ ఫ్యాన్స్‌తో పాటు యూత్ ఆడియెన్స్ అంతా తెగ ఎంజాయ్ చేశారు. థియేటర్లో కుర్చీలపై ఎక్కి ఈలలు వేస్తూ, గోలలు చేస్తూ తెగ సందడి చేశారు. ఇటీవల రీరిలీజైన ‘ఓయ్’కు కూడా ప్రేక్షకుల నుంచి ఇలాంటి రెస్పాన్సే వస్తోంది. ఈ మూవీ ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో ఒకమ్మాయి చేసిన డ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
‘ఆరెంజ్’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఓయ్’.. ఈ సినిమాలు మొదటిసారి రిలీజైన టైమ్‌లో కమర్షియల్‌గా అంత వర్కౌట్ కాలేదు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నా, మంచి ప్రయత్నాలు అంటూ అప్లాజ్ తెచ్చుకున్నా మేకర్స్‌కు నష్టాలు మిగిల్చాయి. కానీ రీరిలీజ్‌లో మాత్రం ఫుల్ ప్రాఫిట్స్ను అందించాయి. దీనికి ఈ మూడు సినిమాల్లోని పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలవడం, మంచి కామెడీ సీన్స్, యూత్‌కు నచ్చే రొమాంటిక్ సీన్స్ ఉండటం ఒక కారణమని చెప్పొచ్చు. ఇవి రిలీజైన తర్వాత కాలంలో వీటిని టీవీల్లో చాలా మంది ఎంజాయ్ చేశారు.
ఏళ్లు గడిచే కొద్దీ వైన్‌కు విలువ పెరిగినట్లే క్రమంగా ‘ఆరెంజ్’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఓయ్’ లాంటి సినిమాలకు కల్ట్ వ్యాల్యూ అంతకంత పెరుగుతూ పోయింది. అందుకే వీటి రిలీజ్లు మిస్సయిన వారు, బిగ్ స్క్రీన్‌లో మరోమారు ఎక్స్‌పీరియెన్స్ చేద్దామనుకున్న వారు థియేటర్లకు పోటెత్తారు. ఇదే ఆదరణ అప్పట్లో దక్కి ఉంటే ఆ చిత్రాలు, వాటిల్లో నటించిన వారి ఫేట్ వేరేలా ఉండేది. ముఖ్యంగా ‘ఓయ్’ హిట్ అయి ఉంటే సిద్ధార్థ్ మరికొంత కాలం నిలదొక్కుకునేవారు. పైసినిమాల్లో ఉన్న మ్యాజిక్, మ్యూజిక్, డైలాగ్స్, డాన్స్, కామెడీ.. ఇలా చాలా విషయాలు క్రమంగా కల్ట్‌గా మారి ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాయని చెప్పొచ్చు. మరి.. కొన్ని కల్ట్ మూవీస్ మొదట్లో ఫట్ అవడం, ఆ తర్వాత రీరిలీజ్‌లో హిట్టవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Nellore Neeraja: ఎప్పుడూ నవ్వించే నెల్లూరు నీరజ తొలిసారి కన్నీరు! కారణం?
❤️🔥 pic.twitter.com/zyApbevcjD
— shankar (@IsmartShankar66) February 14, 2024
Orange re-release is something else man ❤️
Next year valentine’s day ki malli release chesina same explosive response untadhi ey cinema ki aa range ledhu 💯#RamCharan pic.twitter.com/dQSXTWmh56
— Raghu Charanism (@RaghuCharanism7) February 15, 2024