iDreamPost
android-app
ios-app

ముఖానికి సర్జరీ.. ఫొటో రిలీజ్ చేసి షాకిచ్చిన యువనటి!

Actress Post On Her Facial Surgery: సినిమా తారలు అవ్వాలన్నా.. కొన్ని సంవత్సరాలు నటిగా కొనసాగాలి అన్నా కొన్ని త్యాగాలు చేయాలి. కొన్ని కష్టాలు పడాలి. ఇప్పుడు ఒక హీరోయిన్ అదే దారిలో నడుస్తోంది.

Actress Post On Her Facial Surgery: సినిమా తారలు అవ్వాలన్నా.. కొన్ని సంవత్సరాలు నటిగా కొనసాగాలి అన్నా కొన్ని త్యాగాలు చేయాలి. కొన్ని కష్టాలు పడాలి. ఇప్పుడు ఒక హీరోయిన్ అదే దారిలో నడుస్తోంది.

ముఖానికి సర్జరీ.. ఫొటో రిలీజ్ చేసి షాకిచ్చిన యువనటి!

ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం. ఇక్కడ నెగ్గుగు రావాలి అంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. అందుకు తగిన ఆదరణ, ప్రోత్సాహం కూడా ఉండాలి. అందుకోసం నటులు, నటీమణులు అవరమైతే సర్జరీ కూడా చేయించుకుంటారు. అయితే రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఆ సర్జరీ సమయంలో ఒకింత నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు. చాలామంది ఈ విషయాల గురించి మాట్లాడరు. కానీ, ఒక యువనటి మాత్రం తాను అనుభవించిన బాధ, నొప్పి, తాను చూసిన నరకం గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. అలాగే ఆ సర్జరీకి సంబంధించిన ఫొటో కూడా రిలీజ్ చేసింది. ఆమె ధైర్యాన్ని చూసి నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ యువనటి మరెవరో కాదు.. త్రినేత్ర అలియాస్ త్రినేత్ర హల్దర్ గుమ్మరాజు. అవును తాను ఒక ట్రాన్స్ జెండర్ నటి. త్రినేత్ర తెలుగు/ బెంగాలీ కుంటానికి చెందిన యువకుడు. తాను బెంగళూరులో పుట్టాడు. తనకు 20 ఏళ్లు వచ్చే వరకు అబ్బాయిగానే ఉన్నాడు. కానీ, ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో తన శరీరంలో కొన్ని మార్పులను గమనించాడు. తానలో అబ్బాయి కంటే అమ్మాయి లక్షణాలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాడు. అందుకే తాను అమ్మాయిగా మారిపోవాలి అనే నిర్ణయానికి వచ్చాడు.

అనుకున్నదే తడవుగా 2018లో త్రినేత్రగా మారిపోయింది. 2019లో థాయ్ ల్యాండ్ వెళ్లి సర్జరీ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా మారిపోయింది. తనకు తన కుటుంబం మొత్తం అండగా నిలిచింది. ఆమె చదువును కూడా ఆపలేదు. ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అంతేకాకుండా తనలాంటి ఎంతో మంది ట్రాన్స్ జెండర్స్ కు అవగాహన కల్పించేందుకు కంటెంట్ క్రియేటర్ గా మారిపోయింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనలాంటి ఇబ్బందులు ఉన్న వారిని గైడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె నటిగా మారింది. ఇటీవల విడుదలైన ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ అనే వెబ్ సిరీస్ తో నటిగా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత రెయిన్ బో రిస్తా అనే మరో సిరీస్ లో కూడా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin)

తాను ట్రాన్స్ జెండర్ గా అయితో మారిపోయింది. కానీ, తనకి ఎందుకే అంత సంతృప్తిగా అనిపించలేదు. అందుకే తన ముఖాన్ని కూడా మార్చుకునేందుకు త్రినేత్ర నిర్ణయానికి వచ్చేసింది. ఏప్రిల్ 8వ తేదీన తన ముఖానికి సర్జరీ చేయించుకుంది. ఆ విషయాన్ని తాజాగా ఈ నటి వెల్లడించింది. సర్జరీ అంత తేలిక కాదు.. కోలుకోవడం కూడా చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది. సర్జరీ తర్వాత తన బ్యాండేజులతో ముఖం ఎలా ఉందో తన అభిమానులకు చూపించింది. అంతేకాకుండా అలాంటి కష్టమైన సమయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో కూడా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. తనకు కష్ట సమయంలో తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలిపింది. మరి.. త్రినేత్ర ముఖానికి సర్జరీ చేయించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Trinetra Haldar Gummaraju (@trintrin)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet