iDreamPost
android-app
ios-app

ఆస్కార్‌ విన్నర్‌ ఇంటి కూల్చివేతకు నోటీసులు.. కారణమిదే!

  • Published Sep 30, 2023 | 9:36 AM Updated Updated Sep 30, 2023 | 9:36 AM
ఆస్కార్‌ విన్నర్‌ ఇంటి కూల్చివేతకు నోటీసులు.. కారణమిదే!

ఉత్తర్ ప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు. అన్యాయాలు, అక్రమాలకు, అత్యాచారాలకు పాల్పపడిన వారి ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఇంటి కూల్చివేతకు అధికారులు నోటీసులు పంపించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన ‘స్మైల్ పింకీ’ గురించి తెలియని వారు ఉండరు. 2008 లో ఆమె నటించిన ‘స్మైల్ పింకీ’ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. పింకి సొంకర్ జీవిత కథ ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది. తాజాగా స్మైల్ పింకీ మరోసారి వార్తల్లో నిలిచింది. పింకి సోంకర్ కుటుంబం నివసిస్తున్న ఇంటిని కూల్చివేసేందుకు యూపీ అటవీశాఖ అధికారులు నోటీసు ఇవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మీర్జాపూర్ జిల్లాలో ధాబీ గ్రామ నివాసి పింకి సోంకర్. అయితే అక్రమంగా అటవీ స్థలాన్ని ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టారని పింకితోపాటు మరికొందరు గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులు సెప్టెంబర్ 21న కూల్చివేస్తామని నోటీలసులు పంపించారు. దీనిపై స్పందించిన పింకి సోంకర్ తండ్రి రాజేంద్ర సొంకర్ ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని.. పింకి సోంకర్ తీసిన డాక్యుమెటరీకి ఆస్కార్ అవార్డు వచ్చినందుకు గాను అటవీ శాఖ అధికారులు ఇచ్చిన భూమిలోనే తాము ఇంటిని నిర్మించుకున్నామని తెలిపారు. కాగా, పింకి తండ్రి అభ్యంతరం పై ఒక కమిటీ ఏర్పాటు చేశామని, న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని మీర్జాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ చెప్పారు. న్యాయబద్దంగా సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.