ఆరెంజ్ మూవీ హీరోయిన్ ఏమైపోయింది! చాలా మందికి తెలియని విషయాలు!

రామ్ చరణ్- జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆరెంజ్. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. సినిమా ఎలా ఉన్నా.. ఇందులో పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్. ఇందులో రూబా రూబా సాంగ్‌లో ఆకట్టుకున్న బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

రామ్ చరణ్- జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఆరెంజ్. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. సినిమా ఎలా ఉన్నా.. ఇందులో పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్. ఇందులో రూబా రూబా సాంగ్‌లో ఆకట్టుకున్న బ్యూటీ.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

సినిమా కాన్సెప్టు బాగున్నప్పటికీ జనాలకు ఎక్కని సినిమాల లిస్ట్ తీస్తే ఫస్ట్ ప్లేసులో నిలుస్తుంది ఆరెంజ్. 2010లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కొడుకు రామ్ చరణ్‌ను హీరోగా పెట్టి అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా తీశాడు బాబాయి నాగబాబు. బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన భాస్కర్ ఈ మూవీకి దర్శకుడు. జెనీలియా హీరోయిన్.ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో తాను నష్టాల్లో కూరుకుపోయినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాగబాబు. రియాలిటీకి దగ్గరగా ఉండటంతో పాటు స్టోరీ అడ్వాన్స్ (ఈ జనరేషన్ లో రావాల్సిన చిత్రం)గా ఉండటంతో ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో ఆరెంజ్ మూవీ ప్లాప్ మూటగట్టుకుంది. అయితే ఇటీవల ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే.. కలెక్షన్ల వర్షం కురిపించడం గమనార్హం. ఇక ఈ మూవీకి హరీష్ జైరాజ్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. పాటలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్.

ఆరెంజ్ మూవీ అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చే సాంగ్ ‘రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయి రాబ’. మనస్సుకు హత్తకుపోయే ఈ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్ సాంగ్. ఇది ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో వస్తుంది. ఈ పాటలో చెర్రీకి జోడీగా నటించిన యాక్టర్ గుర్తుందా..? ఇందులో రూబాగా చెర్రీ ప్రియురాలిగా నటించింది. ఆ నటి పేరు షాజన్ పదంసీ. ఈ సినిమాతో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. తెలుగులో బిజీ యాక్టర్ అయిపోతుందని భావించారు కూడా కానీ ఒక్కటంటే ఒక్కటే తెలుగు మూవీలో నటించింది. అదే వెంకటేశ్, రామ్ మల్టీ సార్టర్లుగా నటించిన మసాలా. ఇందులో రామ్‌కు జోడీగా నటించింది. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మసాలా తర్వాత ఆమె చేసినవీ కేవలం రెండంటే రెండు సినిమాలు అవి కూడా హిందీ చిత్రాలే.

షాజన్ ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన నటి. ఆమె ఫాదర్ ఫిల్మ్ మేకర్ అలిక్ పదంసీ, అమ్మ పాప్ సింగర్. తండ్రి అడుగు జాడల్లోనే థియేటర్ ఆర్టిస్టుగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. అలా ఆమెకు యష్ రాజ్ ఫిల్మ్స్ రాకెట్ సింగ్ సెల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ మూవీ ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత తమిళంలో జై, స్వాతి నటించిన కనిమోళి (తెలుగులోలవ్ జర్నీగా డబ్బింగ్ అయ్యింది)లో కూడా యాక్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. ఆరెంజ్ మూవీ డిజాస్టర్ కావడంతో హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో సక్సెస్ పొందింది. టాలీవుడ్‌లో మరోసారి తన అదృష్టాన్ని మసాలా రూపంలో పరీక్షించుకుంది. కానీ మరోసారి నిరాశే ఎదురైంది. సాలిడ్ పటేల్స్ మూవీ తర్వాత ఎనిమిదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2023లో పాగల్ పన్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇక సినిమాలతో కన్నా.. సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా గడుపుతుంది రూబా.

Show comments