iDreamPost
android-app
ios-app

ఆస్కార్ అవార్డ్స్ 2024.. ఓపెన్ హైమర్ కు అవార్డుల పంట.. విన్నర్స్ వీరే!

ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్ అదరగొడుతోంది.

ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్ అదరగొడుతోంది.

ఆస్కార్ అవార్డ్స్ 2024.. ఓపెన్ హైమర్ కు అవార్డుల పంట..  విన్నర్స్ వీరే!

ఆస్కార్ అవార్డ్స్.. జీవితంలో ఒక్కసారైనా సాధించాలని కోరుకుంటుంటారు సినీ రంగంలో ఉన్నవారు. వరల్డ్ వైడ్ గా ఆస్కార్ అవార్డ్స్ కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతాయి. సినీ సెలబ్రిటీలు, ప్రేక్షకులు, ఆస్కార్ కు నామినేట్ అయిన వారు ఆస్కార్ వేడుకల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ఆస్కార్ అవార్డ్స్ సెలబ్రేషన్స్ అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో అట్టహసంగా ప్రారంభమయ్యాయి. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ అవార్డుల్లో ఓపెన్ హైమర్ సినిమాకు అవార్డుల పంట పండింది. క్రిస్టోఫర్ నోలన్ బయోపిక్ ‘ఒపెన్‌ హైమర్’ అత్యధిక నామినేషన్‌లతో (13) ఆస్కార్‌ అవార్డ్ 2024కు వచ్చింది.

ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డ్స్ విజేతలు వీరే

  • ఉత్తమ చిత్రం: (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
  • ఉత్తమ ఎడిటింగ్‌: జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: గాడ్జిల్లా మైనస్‌ వన్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌): ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌
  • ఉత్తమ ఒరిజినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ఓపెన్‌హైమర్‌
  • ఉత్తమ సౌండ్‌ : ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌
  • ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌: వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌ ( బార్బీ)
  • లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ సుగర్‌
  • బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
  • బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
  • బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
  • ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
  • బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)

View this post on Instagram

A post shared by IDream Media (@idreammedia)