Aditya N
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ ట్రైలర్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. హిందీ ట్రైలర్ ను సల్మాన్ విడుదల చేయగా, తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. మరీ ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ ట్రైలర్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. హిందీ ట్రైలర్ ను సల్మాన్ విడుదల చేయగా, తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. మరీ ఆ ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..
Aditya N
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ ను ఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. హిందీ ట్రైలర్ ను సల్మాన్ విడుదల చేయగా, తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ సినిమా కథ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంది. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కునే సమస్యలు, సవాళ్లను సినిమాలో చూపించే ప్రయత్నం చేశామని ప్రచారంలో భాగంగా వరుణ్ తేజ్ తెలిపారు.
ఇక ట్రైలర్ లో దాదాపు సినిమా కథను చెప్పేశారు. ముందుగా రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. ట్రైలర్ అయన పాత్రను ప్రధానంగా చూపిస్తూ సాగింది. ” రాడార్ లో నువ్వున్నంత వరకూ… నాకు ఏం అవుతుంది” అని వరుణ్ మానుషితో అనే డైలాగ్ బాగుంది. అలాగే ” మనం మౌనంగా ఉన్న ప్రతీ సారి వాళ్ళు దాన్ని చేతకానితనంగా భావించారు” అని వరుణ్ తేజ్ భారత్ – పాకిస్తాన్ మధ్య ఉన్న తేడాను చూపిస్తూ చెప్పే ఏమోషనల్ డైలాగ్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. అందుకే సినిమాకి ఆపరేషన్ వాలెంటైన్ అనే టైటిల్ పెట్టారు. మొత్తానికి ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలను పెంచిందనే చెప్పాలి.
యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రేక్షకుల ఒళ్ళు గగుర్పొడిచే ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాలో ఉన్నాయని అంటున్నారు. నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ మరియు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన మానుషి చిల్లర్, హీరోయిన్ పాత్రను పోషించారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ నిర్మాణంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైస్సెన్స్ పిక్చర్స్ నుండి సందీప్ ముద్దా సహకారంతో పాటు సహ నిర్మాతలు నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పాల్గొన్నారు. మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.