iDreamPost
android-app
ios-app

Operation Valentine: మార్చిలో రానున్న ఆపరేషన్ వాలంటైన్?

  • Published Feb 02, 2024 | 1:11 PM Updated Updated Feb 02, 2024 | 1:11 PM

వైమానిక దళ సిబ్బందితో సంభాషించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వరుణ్ ఇటీవల సాయుధ దళాల కమాండర్ తో ఇంటర్వ్యూను కూడా పంచుకున్నారు. అయితే సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా కోసం హీరో చేసిన ప్రయత్నాలు అడియాసలయినట్లుగా కనిపిస్తుంది.

వైమానిక దళ సిబ్బందితో సంభాషించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వరుణ్ ఇటీవల సాయుధ దళాల కమాండర్ తో ఇంటర్వ్యూను కూడా పంచుకున్నారు. అయితే సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా కోసం హీరో చేసిన ప్రయత్నాలు అడియాసలయినట్లుగా కనిపిస్తుంది.

  • Published Feb 02, 2024 | 1:11 PMUpdated Feb 02, 2024 | 1:11 PM
Operation Valentine: మార్చిలో రానున్న ఆపరేషన్ వాలంటైన్?

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 16ను విడుదల తేదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా షూటింగ్ సమయంలో వైమానిక దళ సిబ్బందితో సంభాషించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వరుణ్ ఇటీవల సాయుధ దళాల కమాండర్ తో ఇంటర్వ్యూను కూడా పంచుకున్నారు. అయితే సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా కోసం హీరో చేసిన ప్రయత్నాలు అడియాసలయినట్లుగా కనిపిస్తుంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో మరో రెండు వారాల్లో “ఆపరేషన్ వాలెంటైన్” విడుదల అయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ స్టూడియోలో వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుండగా, ఈ సినిమా డీఐ వర్క్ ఫిబ్రవరి 23 వరకు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. ఫిబ్రవరి 23న వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పటికీ శివరాత్రి పర్వదినాన్ని క్యాష్ చేసుకునేందుకు మార్చి 1 లేదా మార్చి 8న సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే చాలా రిలీజ్ లతో నిండిపోవడం, బాలీవుడ్ లో ఫిబ్రవరి 16 స్లాట్ మిస్ కావడం ఈ సినిమా పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

నిజానికి గతంలోకి వెళితే ఆపరేషన్ వాలంటైన్ డిసెంబర్ 8న విడుదల కావాల్సింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ తేదీ నుండి వాయిదా పడింది.ఈ మూవీని వార్‌ డ్రామా నేపథ్యంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet