iDreamPost

TVలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ..! ఎక్కడంటే..

Ooru Peru Bhairavakona: కామెడీ, హరర్, అడ్వెంచరస్ జోనర్లో అనేక మూవీలు వస్తుంటాయి. ఈ సినిమాలు చూసినంత సేపు ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠంగా అనిపిస్తుంది. అలాంటి థ్రిలింగ్, అడ్వెంచర్ మూవీ త్వరలో టీవీలో రానుంది.

Ooru Peru Bhairavakona: కామెడీ, హరర్, అడ్వెంచరస్ జోనర్లో అనేక మూవీలు వస్తుంటాయి. ఈ సినిమాలు చూసినంత సేపు ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠంగా అనిపిస్తుంది. అలాంటి థ్రిలింగ్, అడ్వెంచర్ మూవీ త్వరలో టీవీలో రానుంది.

TVలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ..! ఎక్కడంటే..

చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్  అవుతాయి. అంతేకాక చాలా రోజుల పాటు థియేటర్లలో సందడి చేసిన అనంతరం ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అయితే థియేటర్లలో చూసినప్పటికీ ఓటీటీలో కూడా ఆ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఇక థియేటర్, ఓటీటీల్లో స్ట్రీమింగ్… సినీ ప్రియులను అల్లరించిన సినిమాల్లో టెలివిజన్ లో కూడ ప్రసారం అవుతుంటాయి. పండగలకు, ప్రత్యేక పర్వదినాలకు బ్లాక్ బస్టర్ హిట్ మూవీలను ప్రసారం చేస్తుంటారు. తాజాగా ఓ థ్రిల్లింగ్ అడ్వేంచరస్ మూవీ టీవీలోకి రానుంది. మరి..  ఆ సినిమా ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పు డు చూద్దాం…

కామెడీ, హరర్, అడ్వెంచరస్ జోనర్లో అనేక మూవీలు వస్తుంటాయి. ఈ సినిమాలు చూసినంత సేపు ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠంగా అనిపిస్తుంది. అలాంటి సినిమాలు ఎన్ని సార్లు చూసిన కూడా ఇంకా చూడాలనిపిస్తుంది. థియేటర్ల, ఓటీటీలో కూడా చూసినప్పటికీ టీవీలో ప్రసారమైన చూస్తుంటారు. అలాంటి వాటిల్లో సందీప్ కిషన్ నటించిన ఓ సినిమా ఉంది. టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విలన్ గా ,హీరోగా తన అద్భుత నటనతో ఎంతగానో మెప్పించాడు. అంతేకాక వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అలానే ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

సందీప్ కిషన్ నటించిన లేసెట్ మూవీ ‘ఊరు పేరు భైరవ కోన’. ఈ సినిమాలో ఫ్రిబ్రవరి  16న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత మార్చి 8న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది.  ఈక్రమంలోనే తాజాగా ఈ మూవీ టీవీలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది.  “ఊరి పేరు భైరవ కోన” మూవీ వరల్డ్‌ టెలివెజన్ ప్రీమియర్ కి సంబంధించిన సమాచారం వచ్చింది. ఈ  సినిమా జూన్‌ 30న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. థియేటర్స్ ,ఓటీటీలో  ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ టీవీ ఆడియన్స్ ను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

సందీప్ కిషన్ నటించిన “ఊరు పేరు భైరవ కోన  మూవీకి వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. అలానే ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాజేశ్‌ దండా నిర్మించారు. ఈ మూవీలో సందీప్ కి జోడిగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా మొత్తం ట్విస్టులతో సాగుతోంది. ఓవరల్ గా థ్రిలింగ్, అడ్వెంచర్ మూవీ అని చెప్పొచ్చు. అలాంటి ఈ సినిమా టీవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో తెలియాలంటే.. జూన్30 వరకు ఆగాల్సింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి