ఇండస్ట్రీలో కొన్నిసార్లు హీరోల క్రేజ్, హీరోయిన్, ట్రైలర్స్ కంటే.. సినిమాలోని పాటలే ఫుల్ హైప్ క్రియేట్ చేసేస్తాయి. ఏ రేంజ్ లో అంటే.. ఒక్క పాట కోసం ఏకంగా జనాలు థియేటర్స్ కి వచ్చేలా అన్నమాట. రెగ్యులర్ గా కాకపోయినా.. అప్పుడప్పుడు సాంగ్స్ తోనే జనాలను థియేటర్స్ కి రప్పించిన సినిమాలున్నాయి. పాటలు అనేవి సినిమాలకు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అలా ఒకే ఒక్క పాటతో ప్రేక్షకులలో ఇంటరెస్ట్ క్రియేట్ చేసిన మూవీ ‘ఊరి పేరు భైరవకోన’. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాని.. దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుండి ‘నిజమేనే చెబుతున్నా” అనే సాంగ్ రిలీజై బాగా పాపులర్ అయ్యింది.
ఆరు నెలల క్రితమే విడుదలైన ఆ పాట.. ఏకంగా 50 మిలియన్స్ కి పైగా వ్యూస్ సంపాదించుకుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఆ పాటను శేఖర్ చంద్ర సమకూర్చాడు. అయితే.. పాట బ్లాక్ బస్టర్ కావడంతో సినిమాపై మినిమమ్ అంచనాలైతే క్రియేట్ అయ్యాయి. కానీ.. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సాంగ్ తర్వాత అసలు సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. సందీప్ కిషన్ కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. కొన్నాళ్ళుగా సాలిడ్ హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ఫ్యాన్స్ కూడా సందీప్ ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమాపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
మరి భైరవకోన సైలెంట్ అవ్వడానికి కారణమేంటి? అనే విషయంపై తాజాగా దర్శకుడు ఆనంద్ స్పందించినట్లు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ.. మా సినిమాకి, విరూపాక్ష సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. జానర్ ఒక్కటే అయినంత మాత్రాన కథలు ఒకేలా ఉండవు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఆలస్యం వల్ల మాత్రమే రిలీజ్ లేటు అవుతుందని చెప్పుకొచ్చారు. అనంతరం ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్పందిస్తూ.. “తమ సంస్థలో కొన్ని కాస్టలీ పొరపాట్లు జరిగాయి. అవి మళ్ళీ రిపీట్ కాకూడదని జాగ్రత్త తీసుకుంటున్నాం. త్వరలోనే సినిమా నుండి రెండో పాట రిలీజ్ చేస్తాం” అని తెలిపారు. ఈ వార్త విని సందీప్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఊరి పేరు భైరవకోన సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.