iDreamPost
android-app
ios-app

Salaar:ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు! సౌత్ నుండి ఒకే ఒక్క హీరోగా !

  • Published Dec 27, 2023 | 2:17 PM Updated Updated Dec 27, 2023 | 2:17 PM

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా 'సలార్'. విడుదలై వారం కూడా కాకుండానే కొన్ని కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా 'సలార్'. విడుదలై వారం కూడా కాకుండానే కొన్ని కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

  • Published Dec 27, 2023 | 2:17 PMUpdated Dec 27, 2023 | 2:17 PM
Salaar:ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు! సౌత్ నుండి ఒకే ఒక్క హీరోగా !

సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ అంచనాల మధ్యన.. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు ఎటువంటి హడావిడి లేకుండా, సినిమాకు సంబంధించిన ప్రతిదీ నేరుగా వెండి తెరపైనే చూపించి.. అభిమానులకు మంచి కిక్  ఇచ్చాడు ప్రశాంత్ నీల్. అభిమానులు ప్రభాస్ చిత్రంపై పెట్టుకున్న ఆశలు అన్ని సలార్ తో నెరవేరాయని చెప్పి తీరాలి. విడుదలైన మొదటి రోజునే రూ. 178 కోట్ల కలెక్షన్ ను తన ఖాతాలో వేసుకుంది సలార్. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో ఇంకొకసారి మోత మోగిపోతోంది.

సలార్ చిత్రానికి ఇటు సౌత్ తో పాటు.. విడుదలైన అన్ని భాషలలోను ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. అటు అమెరికాలో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ 5 మిలియన్ యూఎస్ డాలర్స్ వరకు చేసింది. బాహుబలి 1, 2 తర్వాత సలార్ సినిమా అక్కడ 5 మిలియన్ యూఎస్ డాలర్స్ ను వసూళ్లు చేసింది. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క హీరోకు ఇటువంటి ఘనత దక్కలేదు. కాబట్టి, ఇండియా నుంచి ఈ భారీ రికార్డ్స్ ను తన సొంతం చేసుకున్న ఏకైక హీరోగా రెబెల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ రేంజ్ ను ఈ రకంగా పెంచిన ఘనత.. దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కుతుంది.

కేజియఫ్1,2 తో పాన్ ఇండియా లెవెల్లో తన ప్రతిభను కనబరిచిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో ‘సలార్’ అనౌన్స్ చేసినపుడే.. ఈ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం విడుదలైన తర్వాత.. ఊహించినట్టుగానే.. ఆడియన్సును అల్లాడించేశాడు ప్రశాంత్. విడుదలైన మూడు రోజులకే రూ. 300 కోట్లు, ఐదు రోజులకు రూ. 500 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు ప్రభాస్. వరుసగా ఐదు సినిమాలతో రూ.400 కోట్లు రాబట్టిన ఏకైక టాలీవుడ్ హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. బాహుబలి1,2 , సాహో, ఆదిపురుష్ సినిమాల తర్వాత తాజాగా సలార్ కూడా రూ.400 కోట్లు వసూళ్ళు చేసిన జాబితాలో చేరింది. బాహుబలి1,2 తర్వాత కొద్దిరోజులకే ఆ రేంజ్ లో వసూళ్లను రాబట్టిన చిత్రంగా సలార్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి RRR తర్వాత ‘సలార్’ మాత్రమే అత్యధిక వసూళ్లను రాబట్టిన క్లబ్ లో ఉంది.

అదీ కాకుండా ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో.. మొదటిరోజునే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కూడా సలార్ ఏ ప్రత్యేకంగా నిలిచింది. ఇంకా థియేటర్ లలో సలార్ ఊపు ఏ మాత్రం తగ్గకుండా.. అదే రేంజ్ లో దూసుకుపోతోంది. ఒకవేళ సలార్ చిత్రం రూ.1000 కోట్లు రాబడితే.. ఇండస్ట్రీలో రెండు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేస్తాడని చెప్పడంలో.. ఏ మాత్రం సందేహం లేదు. అటు ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ కూడా కేజియఫ్1,2 తర్వాత రెండు వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన దర్శకుడిగా ఘనత దక్కించుకుంటాడు. ఏదేమైనా, కొన్ని వేల కోట్లు రాబట్టే అంత రేంజ్ డార్లింగ్ ప్రభాస్ కి మాత్రమే సాధ్యం అని చెప్పి తీరాల్సిందే. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap