iDreamPost
android-app
ios-app

ఓం భూమ్ భుష్ ట్రైలర్ రిలీజ్.. సంపంగి మహల్ సంపద కథేంటి?

  • Published Mar 15, 2024 | 7:05 PM Updated Updated Mar 15, 2024 | 7:05 PM

Om Bhoom Bush Trailer Revie: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వస్తున్న ఓం భూమ్ బుష్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉంది? సినిమాతో హిట్టు కొట్టబోతున్నారా?

Om Bhoom Bush Trailer Revie: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వస్తున్న ఓం భూమ్ బుష్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉంది? సినిమాతో హిట్టు కొట్టబోతున్నారా?

  • Published Mar 15, 2024 | 7:05 PMUpdated Mar 15, 2024 | 7:05 PM
ఓం భూమ్ భుష్ ట్రైలర్ రిలీజ్.. సంపంగి మహల్ సంపద కథేంటి?

టాలీవుడ్ లో మరో ఫుల్ లెంగ్త్ కామెడీ జానర్ సినిమా రాబోతోంది. అది మరేదో కాదు.. ఓం భూమ్ భుష్ మూవీ. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ విడుదలయ్యాక అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చేసింది. ఇది చూశాక సగటు ఆడియన్ కి ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉంది.? అసలు ఆ ఓం భూమ్ భుష్ కథేంటి? శ్రీవిష్ణు- రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కెరీర్ లో హిట్టు పడబోతోందా?

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబోలో వచ్చిన జాతిరత్నాలు సినిమా ఎంత మంచి సక్సెస్ సాధించిందో అందరికీ తెలసిందే. అయితే ఈ సినిమాలో నవీన్ ప్లేస్ లో శ్రీవిష్ణు ఉన్నాడు. అలాగని ఇవి రెండు ఒకటే అనడం కూడా కరెక్ట్ కాదు. మొదట టీజర్ చూసినప్పుడు మాత్రం ఇదేదో ఓన్లీ కామెడీ బేస్ మీద నడిచే సినిమా అనుకున్నాం. కానీ, ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు కథ అర్థమైంది. ఈ ముగ్గురు కుర్రాళ్లు ఓ ఊరికి వెళ్తారు. అక్కడ గ్రామస్థులకు ఉండే లైంగిక సమస్యలను తీరుస్తున్నట్లు చూపించారు.

అయితే వీళ్లంతా ఏదో కారణంతోనే అక్కడికి వెళ్లినట్లు అనిపిస్తోంది. తర్వాత ఎవరో బాబాలు వచ్చి వీళ్లని సవాలు చేస్తారు. అంత మగాళ్లే అయితే సంపంగి మహల్ లో ఉన్న నిధిని తీసుకురావాలి అంటూ ఛాలెంజ్ చేస్తారు. ఈ సవాలుని స్వీకరించిన హీరోలు మహల్ కి వెళ్తారు. అక్కడ వారికి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు అక్కడ నిజంగానే నిధి ఉందా? వీళ్లనే ఎందుకు అక్కడికి వెళ్లమన్నారు? ఈ సినిమాలో సూపర్ న్యాచురల్ స్పిరిట్ ఉన్నట్లు ఏమైనా చూపించబోతున్నారా? ఇలాంటి చాలానే ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానాలు దొరకాల్సి ఉంది. ఇంక ఈ ముగ్గురి యాక్టింగ్ విషయానికి వస్తే.. ఫన్ అనగానే శ్రీవిష్ణు చెలరేగిపోతాడు. అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ యునీక్ గా చూపిస్తున్నారు. మహల్ లో కి వెళ్లి ఎగ్జైట్ అవుతున్నాను అనడం.. దెయ్యం వచ్చి మగాడు కావాలి అంటే శ్రీవిష్ణు నేనే అనడం ఇలా సినిమాలో చాలానే ఫన్ ఉండేలా ఉంది. మొత్తానికి ఓం భూమ్ బుష్ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదల కాబోతోంది. అప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానాలు, సినిమా రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. మరి.. ఓం భూమ్ బుష్ సినిమా ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio