iDreamPost
android-app
ios-app

No Entry Movie: బాలీవుడ్ కామెడీ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్

  • Published Apr 01, 2024 | 1:21 PM Updated Updated Apr 01, 2024 | 1:21 PM

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ హవా నడుస్తుంది.తెలుగు, తమిళ, కన్నడతో పాటు మలయాళ సినిమా పరిశ్రమలో కూడా ఇప్పుడు బిగ్ సీక్వెల్స్ నిర్మాణంలో ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ హవా నడుస్తుంది.తెలుగు, తమిళ, కన్నడతో పాటు మలయాళ సినిమా పరిశ్రమలో కూడా ఇప్పుడు బిగ్ సీక్వెల్స్ నిర్మాణంలో ఉన్నాయి.

  • Published Apr 01, 2024 | 1:21 PMUpdated Apr 01, 2024 | 1:21 PM
No Entry Movie:  బాలీవుడ్ కామెడీ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ హవా నడుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడతో పాటు మలయాళ సినిమా పరిశ్రమలో కూడా ఇప్పుడు బిగ్ సీక్వెల్స్ నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ సీక్వెల్ ట్రెండ్ ను ఎప్పుడు మొదలు పెట్టింది హిందీ సినిమా పరిశ్రమ. జానర్ తో సంబంధం లేకుండా ఏ సినిమాకి అయినా సీక్వెల్స్ తీయడంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. తాజా వార్తల ప్రకారం ప్రొడ్యూసర్
బోనీ కపూర్ నో ఎంట్రీ 2 ని తెరకెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

2005లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ గా నిలిచిన సినిమా నో ఎంట్రీ. బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్‌లో 10 మంది హీరోయిన్లు ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారట. ఈ హీరోయిన్ల పేర్లను మేకర్స్ ఇంకా వెల్లడించనప్పటికీ, అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా హీరోలుగా అర్జున్ కపూర్, దిల్జిత్ దోసాంజ్ తో పాటు వరుణ్ ధావన్ వంటి యువ హీరోలు నటిస్తారట. మరి అటువంటి స్టార్ ల సరసన నటించే హీరోయిన్స్ కూడా ఖచ్చితంగా స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళే ఉంటారని భావిస్తున్నారు. తాజాగా ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన బోనీ కపూర్ “మేము ఈ సంవత్సరం చివరి నాటికి, అంటే డిసెంబర్‌లో నో ఎంట్రీ 2ని ప్రారంభిస్తాము. దీంట్లో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ తో పాటు దిల్జిత్ దోసాంజ్‌ కూడా నటిస్తారు. మేము ఇంకా హీరోయిన్ లను ఎంపిక చేయలేదు. అజయ్ దేవగణ్ మైదాన్ విడుదలైన వెంటనే, మేము హీరోయిన్లను సెలెక్ట్ చేస్తాం.

No Entry

 

ఒరిజినల్ నో ఎంట్రీలో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ తో పాటు ఫర్దీన్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించగా, ఈషా డియోల్, లారా దత్తా, బిపాషా బసు, సెలీనా జైట్లీలు హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతానికి, నో ఎంట్రీ 2 సినిమాకి విడుదల తేదీ ప్రకటించలేదు. అయితే ఈ కామెడీ సీక్వెల్ 2025 దీపావళి పండుగ సందర్భంగా విడుదల కానుందని టాక్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటుల సెలెక్షన్ జరుగుతోంది. ఇక పూర్తి తారాగణానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/