iDreamPost
android-app
ios-app

దేవరలో ఎన్టీఆర్ సర్ప్రైజ్ రోల్?

  • Published Mar 23, 2024 | 1:23 PM Updated Updated Mar 23, 2024 | 1:23 PM

Devara: ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రెండు సన్నివేశాల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మరో ఆసక్తికరమైన పాత్ర/షేడ్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

Devara: ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రెండు సన్నివేశాల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మరో ఆసక్తికరమైన పాత్ర/షేడ్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

  • Published Mar 23, 2024 | 1:23 PMUpdated Mar 23, 2024 | 1:23 PM
దేవరలో ఎన్టీఆర్ సర్ప్రైజ్ రోల్?

మ్యాన్ ఆఫ్ మాసెస్ గా అభిమానుల చేత ప్రేమగా పిలిపించుకునే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో “దేవర” అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రెండు భాగాలలో విడుదల కానున్న ఈ సినిమా పార్ట్ 1 షూటింగ్ జరుగుతోంది. అలనాటి మేటి నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. దర్శకుడు కొరటాల శివ భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రెండు సన్నివేశాల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మరో ఆసక్తికరమైన పాత్ర/షేడ్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

తండ్రీ, కొడుకులుగా ఇప్పటికే రెండు పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్ మరో గెటప్ లో కూడా కనిపిస్తారట. మరి ఇది మూడో పాత్రగా ఉంటుందా లేక కేవలం ఒక సందర్భంలో ఏదైనా డిఫరెంట్ గెటప్ లో ఎన్టీఆర్ కనిపిస్తారా అనేది చూడాలి. నటుడిగా ఎన్టీఆర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తారక్ ఎలాంటి పాత్రకైనా ఒదిగిపోతారనే పేరుంది. మరి తనలోని నటుడికి సవాలు విసిరే పాత్ర వస్తే మరింత చెలరేగిపోతారు. మరి ఇప్పటికే భారీ అంచనాల నడుమ వస్తున్న దేవర మొదటి భాగానికి ఈ ఎన్టీఆర్ సర్ప్రైజ్ రోల్ కూడా తోడైతే మరింత హైప్ పెరుగుతుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లేటెస్ట్ సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర పార్ట్ 1, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండేలా చూస్తున్నారు. ఇటీవలే దేవర సినిమా షూటింగ్ సెట్స్ లోని ఎన్టీఆర్ పిక్స్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్టోబర్ 10న దేవర పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుంది.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş