‘దేవర’ మూవీలో NTR భార్యగా నటించి ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Actress Shruti Marathe: సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూడు ‘దేవర’మూవీ టాక్ వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కొరటాల శివ తెరెక్కిస్తున్నారు.

Actress Shruti Marathe: సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూడు ‘దేవర’మూవీ టాక్ వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కొరటాల శివ తెరెక్కిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’ ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వస్తున్న మూవీ కావడం.. అందులోనూ డ్యూయల్ రోల్ కనిపించడంతో ఫ్యాన్స్ తో పాటు యూత్ లో కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్లు కొత్త ఫీలింగ్ ను కలిగిస్తాయని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో దేవర పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ భార్యగా నటించిన హీరోయిన్ శృతి మరాఠీ గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

శృతి మరాఠీ గుజరాత్ కు చెంది అమ్మాయి.. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ మె మరాఠీ, హిందీ సినిమాల్లో హిరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. గతంలో తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది శృతి. అంతేకాదు కొన్ని హిందీ సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటించింది. ఈ మధ్య వెబ్ సీరీస్ లో కూడా ఛాన్సులు దక్కించుకుంటుంది. ప్రముఖ నటుడు గౌరవ్ ఘటనేకర్ ని 2016 లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.  ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంది.  చాలా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో ‘దేవర’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో తండ్రి  దేవర,  కొడుకు వర అనే రెండు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు.. వర (కొడుకు)కు జంటగా జాన్వీ కపూర్, దేవర(తండ్రి) పాత్రకు జంటగా శృతి మరాఠి కనిపించబోతుంది.

ఈ మూవీలో శృతి మరాఠీ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.  ఒక ఎన్టీఆర్ కి భార్యగా.. మరో ఎన్టీఆర్ కి తల్లిగా ఆమె కనిపించబోతుంది. ఈ మూవీలో శృతి మరాఠీ సెంటిమెంట్ సీన్లు బాగా ఆకట్టుకుంటాయని టాక్ వినిపిస్తుంది.  ఇటీవల శృతి తన యంగ్, ముసలి లుక్స్ తో దిగిన సెల్ఫీలు కొన్ని పోస్ట్ చేసింది.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ.. దేవర భార్య పాత్రకు ఒక కొత్త ముఖం భారీ అంచనాలు లేని నటిని తీసుకోవాలని అనుకున్నాం. అందుకే శృతి మరాఠీని తీసుకున్నామని అన్నారు. కాకపోతే ఈ మూవీలో ఆమె నటించిన సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

Show comments