iDreamPost
android-app
ios-app

దేవర గండం గట్టెక్కేశాడు.. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి ?

  • Published Oct 15, 2024 | 5:49 PM Updated Updated Oct 15, 2024 | 5:49 PM

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కు తారక్ కు మంచి క్రేజ్ లభించింది. దీనితో నెక్స్ట్ సినిమాలు ఇంకా హిట్ అవ్వడం కష్టం అని ఫిక్స్ అయ్యారు. కట్ చేస్తే ఆ మిత్ ని బ్రేక్ చేసి సక్సెస్ చూపించారు తారక్. మరి రామ్ చరణ్ పరిస్థితేంటి ?

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కు తారక్ కు మంచి క్రేజ్ లభించింది. దీనితో నెక్స్ట్ సినిమాలు ఇంకా హిట్ అవ్వడం కష్టం అని ఫిక్స్ అయ్యారు. కట్ చేస్తే ఆ మిత్ ని బ్రేక్ చేసి సక్సెస్ చూపించారు తారక్. మరి రామ్ చరణ్ పరిస్థితేంటి ?

  • Published Oct 15, 2024 | 5:49 PMUpdated Oct 15, 2024 | 5:49 PM
దేవర గండం గట్టెక్కేశాడు.. మరి గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వీరిద్దరికి కూడా ఆర్ఆర్ఆర్ మూవీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్. అప్పటివరకు మంచి హిట్స్ నే అందుకున్న ఈ హీరోస్.. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. జక్కన్న చేతికి చిక్కితే అందరి దశ తిరిగాల్సిందే. ఇలా ఇప్పటికి ఎంతో మంది హీరోలకు పాన్ ఇండియా ట్యాగ్ ను అందించారు జక్కన్న. అయితే ఇక్కడ మరో చిక్కుంది. అదేంటంటే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత.. ఆ హీరోల నెక్స్ట్ సినిమాలు ఖచ్చితంగా ప్లాప్ అవుతాయనే టాక్ ఉంది. ఇండస్ట్రీలో రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ఎప్పటినుంచో కొనసాగుతుంది. దీనితో ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ హీరోల అభిమానులకు జక్కన్న ప్లాప్ సెంటిమెంట్ భయం పట్టుకుంది. ఎక్కడ తమ అభిమాన హీరోలు డౌన్ అయిపోతారా అని టెన్షన్ పడ్డారు.

కానీ తారక్ ఒక్క దెబ్బతో ఆ భయాలన్నిటిని తుడిచిపెట్టేశాడు. దేవరతో ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న రాజమౌళి మిత్ ను బ్రేక్ చేశాడు. దీనితో ప్రతి ఒక్క అభిమాని కాలర్ ఎగరేసుకుంటూ.. తారక్ ను పొగడ్తలతో ముంచేశారు. దేవర హిట్ అవ్వడమే కాదు.. కోట్లు కొల్లగొట్టి ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఎక్కడ సినిమా ప్లాప్ అవుతుందో అనే భయాలను దాటి.. దేవర గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. దీనితో రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ తుడిచిపెట్టుకుపోయిందని అనుకున్నారు. కానీ ఇంకా పూర్తిగా పోలేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లో తారక్ కు ఎంత క్రేజ్ వచ్చిందో.. చరణ్ కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. తారక్ రాజమౌళి గండం గట్టెక్కేశాడు. ఇక ఇప్పుడు చరణ్ వంతు. చరణ్ కూడా గేమ్ ఛేంజర్ తో హిట్ కొట్టేస్తే.. అప్పుడు జక్కన్న ప్లాప్ సెంటిమెంట్ కు పూర్తిగా బ్రేకులు పడినట్లే .

ఇప్పటికే శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో రావాల్సిన గేమ్ ఛేంజర్ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాం అని మాట ఇచ్చారు. మరి ఈసారైనా అది జరుగుతుందో లేదో చూడాలి. అసలే అభిమానులు జక్కన్న సెంటిమెంట్ భయంతో ఉంటె.. ఇండియన్ 2 సినిమాతో శంకర్ ఆ భయాన్ని ఇంకాస్త పెంచాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 మూవీకి ఎలాంటి డిజాస్టర్ టాక్ వచ్చిందో తెలిసిందే. సో ఇప్పుడు అందరి ఎదురుచూపులు గేమ్ ఛేంజర్ మీదే ఉన్నాయి. ఇది ఏ మాత్రం టాక్ ను సంపాదించుకుంటుందో చూడాలి. ఒకవేళ మంచి టాక్ సంపాదించుకుంటే కనుక.. చరణ్ కూడా ఈ గండం గట్టెక్కినట్లే. ఇక తారక్ , చరణ్ చేతిలో మరో రెండు మూడు సినిమాలతో బిజీగా బిజీగా ఉన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.