iDreamPost
android-app
ios-app

NTR – Alia Bhatt: తారక్ కోసం అలియా భట్, అలియా కోసం తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!

  • Published Sep 10, 2024 | 4:32 PM Updated Updated Sep 10, 2024 | 4:32 PM

NTR - Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, అలియా భట్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలో వాళ్లిద్దరూ జంటగా నటించలేదు. తమ నటనలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రమోషన్స్ లో కూడా తెగ సందడి చేశారు.

NTR - Alia Bhatt: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్, అలియా భట్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలో వాళ్లిద్దరూ జంటగా నటించలేదు. తమ నటనలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రమోషన్స్ లో కూడా తెగ సందడి చేశారు.

  • Published Sep 10, 2024 | 4:32 PMUpdated Sep 10, 2024 | 4:32 PM
NTR – Alia Bhatt: తారక్ కోసం అలియా భట్, అలియా కోసం తారక్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ పైనే అందరి చూపంతా ఉంది. అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఈ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదల కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లినప్పటి నుంచి అటు సినిమా సర్కిల్స్, ఇటు సోషల్ మీడియా అంతటా కూడా తెగ వైరల్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని చూడటానికి తెలుగు అభిమానులతో పాటు నార్త్ ఇండియా అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ అలియా భట్, కరణ్ జోహార్ తో ఉన్న పిక్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్, అలియా భట్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలో వాళ్లిద్దరూ జంటగా నటించలేదు. ఇద్దరూ తమ నటనలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో కూడా తెగ సందడి చేశారు. అప్పటి నుంచి వారి స్నేహం మొదలైంది. అలాగే అలియా భట్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఈవెంట్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ అతిధిగా వచ్చారు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇద్దరు మిత్రులు మళ్ళీ కలవడంతో వారి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.

‘దేవర’ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ‘జిగ్రా’ కూడా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమా అక్టోబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఆ రెండు సినిమాల పబ్లిసిటీ కోసం వీరిద్దరిని ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో ఆలియా భట్ ద్వారా హిందీ ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ మందికి దేవర చేరువ అవుతుంది. ఇక ఎన్టీఆర్ వల్ల సౌత్ ప్రేక్షకులకు జిగ్రా సినిమా గురించి తెలుస్తుంది. దీనివల్ల ఇద్దరి మిత్రులకు లాభం ఉంటుంది. మరి జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ కలియిక పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique