iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్.. OTT సీజన్ లో బిగ్ ట్విస్ట్!

Bigg Boss Telugu OTT 2 Contestans: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసిందో లేదో.. అప్పుడే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం అభిమానులు ఎదురుచూపులు ప్రారంభించారు. వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Bigg Boss Telugu OTT 2 Contestans: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసిందో లేదో.. అప్పుడే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం అభిమానులు ఎదురుచూపులు ప్రారంభించారు. వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

బిగ్ బాస్ ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్.. OTT సీజన్ లో బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ తో అయితే ఆ షో పేరు మారుమూల పల్లెటూర్లకు కూడా చేరింది. మరి.. విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదుగా. మంచో చెడో.. బిగ్ బాస్ మీద బజ్ మాత్రం బీభత్సంగా వచ్చేసింది. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు నెక్ట్స్ సీజన్ స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే మెయిన్ సీజన్ అయితే ఇప్పుడల్లా ప్రారంభం కావడం కష్టమే. కానీ, ఓటీటీ సీజన్ మాత్రం అతి త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, పెద్ద ట్విస్టు అయితే ఉన్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1కి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదు. కానీ, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి ఒక లేడీ కంటెస్టెంట్ ని విన్నర్ ని చేశారు. బిందు మాధవిని విన్నర్ ని చేసి వారిపై ఉన్న మచ్చను మాత్రం తొలగించుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఫిబ్రవరి రెండో వారంలోనే ఓటీటీ సీజన్ ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. కానీ, జనవరి కూడా పూర్తయ్యింది. ఇంకా బిగ్ బాస్ ఓటీటీ ఊసే లేకుండా పోయింది. అయితే అందుకు పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఓటీటీ సీజన్ కోసం ఎవరూ ముందుకు రావడం లేదంట. నిజానికి ఓటీటీ సీజన్ కు అంత గొప్ప క్రేజ్ ఉండదని వచ్చే వాళ్లకు కూడా తెలుసు.

ఓటీటీ సీజన్ కోసం సంప్రదిస్తే అందరూ మెయిన్ సీజన్ అయితేనే వస్తామని చెబుతున్నారంట. ఓటీటీ సీజన్ అనగానే నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ హ్యాండిస్తున్నారంట. ఈ విషయంలోనే యాజమాన్యానికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఎవరిని తీసుకురావాలి? ఎలాంటి వారిని ఎంపిక చేస్తే ఆసక్తి పెరుగుతుంది? అసలు ఓటీటీ సీజన్ 2ని స్టార్ట్ చేయాలా వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయారంట. ఈ పరిస్థితిని సెట్ చేయడానికే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొన్న వారిని ఓటీటీ కోసం తీసుకోవాలని భావించారు. ఓటీటీ సీజన్ 2 కోసం ప్రిన్స్ యావర్, నయనీ పావనీ, భోలే షావలి వంటి తాజా సీజన్ వారిని సంప్రదించారంట.

ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. వాళ్లు కూడా ఓటీటీ సీజన్ కి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది మరోసారి బిగ్ బాస్ కి అంటే కష్టమనే చెబుతున్నారంట. ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యానికి ఓటీటీ విషయంలో పెద్ద చిక్కే వచ్చి పడింది. అసలు సీజన్ ని స్టార్ట్ చేయాలా వద్దా? అనే ప్రశ్న కూడా వచ్చింది అంటున్నారు. అయితే ఫిబ్రవరి చివరి వారానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ని ప్రారంభిస్తారంటూ చెబుతున్నారు. మళ్లీ ఈ సీజన్ ని లేట్ చేస్తే.. ఆ తర్వాత మెయిన్ సీజన్ మీద ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 ప్రారంభం అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.