Dharani
Dharani
బ్రహ్మానందం.. పేరు వింటే చాలు మన ముఖం మీదకు ఆటోమెటిగ్గా నవ్వు వచ్చేస్తుంది. ఏళ్ల తరబడి కమెడియన్‌గా వందల సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు బ్రహ్మానందం. సినిమాల్లో ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేసేవారంటేనే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందల సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను కేవలం నవ్వించడమే కాక కొన్ని చిత్రాల్లో తన నటనతో ఏడిపించాడు కూడా. ఈ ఏడాది వచ్చిన రంగమార్తండ సినిమా బ్రహ్మానందంలోని నటుడుని పూర్తి స్థాయిలో బయటకు తెచ్చింది. సినిమాలు, రాజకీయాల్లో వారసత్వం కామన్. సినిమా ఇండస్ట్రీలో విజయం సాధించిన వారు.. తమ వారసులను తప్పకుండా తీసుకు వస్తారు. అలానే బ్రహ్మానందం పెద్ద కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ రాణించలేకపోయాడు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి తనకు నచ్చిన కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు.
ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజ్ గౌతమ్‌కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అది కూడా అతడి సంపాదన గురించి. బ్రహ్మానందం పెద్ద కుమారుడు సినిమాల్లో విజయం సాధించకపోయినా.. స్టార్ హీరోలకు ధీటుగా సంపాదిస్తున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు గౌతమ్ సంపాదన గురించి టాపిక్ ఎందుకు వచ్చింది.. అసలు అతడు ఏం చేస్తాడు.. మరి సోషల్ మీడియాల్లో వస్తోన్న వార్తల్లో నిజమెంత వంటి వివరాలు..
గత కొన్ని రోజుల నుంచి బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజ్ గౌతమ్ సంపాదన గురించి బోలేడు వార్తులు వస్తున్నాయి. ఆయన హీరోగా ఎంట్రీ నాలుగైదు చిత్రాల్లో మాత్రమే నటించాడు. కానీ సంపాదన మాత్రం ఏడాది వందల కోట్లు అంటూ తెగ ప్రచారం సాగుతోంది. రాజ్ గౌతమ్.. తన తండ్రి బ్రహ్మానందం సంపాదనను.. కొన్ని వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారంట. ఆయన ముందు చూపుతో చేసిన పని కారణంగా.. ప్రస్తుతం ఏడాదికి వందల కోట్ల ఆదాయం గడిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అద్దెలు, వ్యాపారంలో వచ్చే ఆదాయం ఇలా అన్నీ కలిపి నెలలకు ముప్పై కోట్ల పైమాటేనని టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే రోజుకి కోటి రూపాయల ఆదాయం. ఆ లెక్కలో చూస్తే ఏడాదికి అది దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలకు పైమాటేనని అంటున్నారు. అంటే ఏకంగా పుష్ప 2 బడ్జెట్ రేంజ్ అన్నమాట.
మరి నిజంగానే రాజ్ గౌతమ్ అంత సంపాదిస్తున్నాడా అంటే.. ఏమో చెప్పలేం. ఎందుకంటే.. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన టాలీవుడ్‌లోనే ఉన్నాడు. ఆయనే సీనియర్ హీరో నరేష్. ఆయన తల్లి విజయ నిర్మల హీరోయిన్‌గా రాణిస్తోన్న సమయంలో తనకు వచ్చే ఆదాయంతో.. కొన్న ఆస్థులు, భూములు కొన్నారు. ఇప్పుడు వాటి విలువ కోట్లల్లో ఉంది. అలానే వాటి నుంచి భారీ ఎత్తున ఆదాయం వస్తుందని స్వయంగా నరేషే తెలిపాడు. పైగా మన ఇండస్ట్రీలో మరే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కీ లేని విధంగా నరేష్‌కి ఓ సొంత కార్ వాన్ కూడా ఉందనే సంగతి అందరికీ తెలసిందే. దీన్ని బట్టి చూస్తే.. బ్రహ్మానందం కొడకు రాజ్ గౌతమ్ సంపాదన కూడా భారీగా ఉంటుందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు అంటున్నారు.
కమెడియన్ బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడైన రాజ గౌతమ్.. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు క్యూ కట్టాయి. తర్వాత బసంతి అనే సినిమాతో మెప్పించే ప్రయత్నం చేసినా ఆకట్టుకోలేక పోయారు. తర్వాత మను అనే మూవీలోనూ నటించారు. కానీ అవేవి ఆయన కెరీర్‌న్ నిలబెట్టలేదు. ఇక కొన్ని రోజుల క్రితమే బ్రహ్మానందం రెండో కుమారుడు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.