Nagendra Kumar
Devil Movie: బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. డిసెంబర్ 29న విడుదలైంది.
Devil Movie: బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నుంచి వచ్చిన తాజా చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. అభిషేక్ నామా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. డిసెంబర్ 29న విడుదలైంది.
Nagendra Kumar
సరిగ్గా సినిమా రిలీజ్ ముందు డెవిల్ గొడవల్లో కూరుకుపోయింది. నిజానికి ఫిల్మ్ మీదనైతే అంచనాలు బాగానా ఉన్నాయి. అదీ కళ్యాణ్ రామ్ కారణంగానే. కానీ ఇంతకన్నా నిర్మాత అభిషేక్ నామా దర్శకుడి స్థానాన్ని ఆక్రమించుకోవడం, దాని స్థానంలో తొలి దర్శకుడు నవీన్ మేడారంని బయటకు పంపించడంతో డెవిల్ వ్యవహారం మరింత వేడెక్కింది. కానీ ఎవరూ కూడా ఈ వ్యవహరాన్ని అంతగా పట్టించుకోలేదన్నట్టుగానే జరిగిపోయింది. సినిమా పరిశ్రమలో ఎవరి గొడవ వాళ్ళది అనుకుంటారంతా. కానీ ప్రతీ ఒక్క విషయానికి జవాబుదారీ తనం ఉంది.
సినీ ఇండస్ట్రీలో 24క్రాఫ్టుల్లో ప్రతీ ఒక్క క్రాఫ్టుకి ఒక సంఘం ఉంది. దానికి బాధ్యతాయుతమైన ఆఫీసు బేరర్లు కూడా ఉంటారు. కానీ, ఈ సారి డెవిల్ సినిమా డైరెక్టర్ స్థానానికి సంబంధించి పెద్ద స్పందన ఎక్కడా రాలేదు. మరి. నవీన్ మేడారం డైరెక్టర్స్ అసోసియేషన్ని సంప్రదించలేదా?, ఎందుకులే అని ఊరుకున్నాడా అనేదే ఇప్పుడు ఎవరికీ అర్ధం కాని విషయం. కాకపోతే నవీన్ మేడారం విడుదల చేసిన లేఖలో మాత్రం ఆ వేదాంతమైతే కొంత కనిపించింది. కానీ నవీన్ చేసిన స్పష్టత కొంత గట్టిగానే ఉంది. తాను దాదాపు 105రోజుల పాటు షూట్ చేశానని, సినిమా మీద సర్వహక్కులు తనవేననే క్లారిటీ ఇచ్చాడు.
కానీ, కథ అనుకున్న దగ్గర్నుంచీ, షూటింగ్ ప్రారంభమై తుదిఘట్టం చేరుకునే వరకూ కూడా దర్శకుడి ప్రయాసను తక్కువ అంచనా వేయలేం. అలాటి దర్శకుడినే కేవలం కరివేపాకు మాదిరి తీసిపారేశారంటే ఇది అంత తేలిగ్గా వదిలేయాల్సిన విషయం కాదు. పైగా హీరో కూడా ఎవడో అల్లయ్య పుల్లయ్య కాదు. సాక్షాత్తూ నందమూరి కళ్యాణ్ రామ్. ఒక స్థాయి, గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్న హీరో. అలాటి హీరో సినిమాలోనే ఇలా జరిగిందంటే మరి నిజానిజాలు ఏమిటన్నది బేరీజు వేయాల్సిన అవసరం కూడా మెండుగా ఉంది. మరో వైపు సినిమా షూటింగ్ చాలా వరకూ మాటల రచయిత విస్సా శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ కలసి షూట్ చేశారనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది.
వాళ్ళు వాళ్ళ పేరు వేసుకోవడం ఇష్టం లేక, నిర్మాత అభిషేక్ నామా పేరు వేసుకోమ్మన్నారనే వర్షన్ కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. తనని, తన పేరుని కూడా కావాలంటే తీసేయొచ్చని నవీన్ మేడారం సంతకం పెట్టాడని నిర్మాతలు చెబుతున్నట్టుగా కూడా వినబడుతోంది. దీని మీద నవీన్ మేడారం ఏ స్పష్టతనూ ఇవ్వలేదు. దాదాపు 70శాతం నవీన్ పూర్తిచేయడం తనకి తెలుసని ఓ సీనియర్ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సరే మొత్తానికి డెవిల్ సినిమాకి అంత ఎక్సైటింగ్ టాక్ రాకపోవడంతో ఈ గొడవ అంత ప్రాధాన్యతను సంతరించుకోలేదని పరిశ్రమలో కొందరు మాట్లాడుతున్నారు.
— Naveen Medaram (@NaveenMedaram) December 27, 2023