iDreamPost
android-app
ios-app

మొదటి పాట షూటింగ్ మొదలుపెట్టిన విశ్వంభర

  • Published Feb 28, 2024 | 3:32 PM Updated Updated Feb 28, 2024 | 3:32 PM

Vishwambhara Crazy Update: మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో వస్తున్న విశ్వంభర మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చింది.

Vishwambhara Crazy Update: మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠ కాంబోలో వస్తున్న విశ్వంభర మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చింది.

  • Published Feb 28, 2024 | 3:32 PMUpdated Feb 28, 2024 | 3:32 PM
మొదటి పాట షూటింగ్ మొదలుపెట్టిన విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రం కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగా అభిమానులు కూడా తమ అభిమాన హీరోను కొత్త పాత్రలో చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వంభర సినిమా షూటింగ్ కు సంభందించి తాజా అప్డేట్ బయటకి వచ్చింది.

ఇటీవలే నల్గొండలో ప్రారంభమైన విశ్వంభర కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌కు మారింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈరోజు శోబి మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాట షూటింగ్ ప్రారంభం కానుంది. అందులో పాల్గొనేందుకు చిరంజీవితో పాటు మిగిలిన నటీనటులు సెట్స్‌ పైకి చేరారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన మాస్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ తరువాత భోళా శంకర్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అందువల్ల తదుపరి సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చిరంజీవి ఆశిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నుంచి పాన్ ఇండియా స్థాయిలో ఒక భారీ హిట్ కావాలని మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరు విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తొలి చిత్రం బింబిసారతోనే సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ ను చక్కగా హ్యాండిల్ చేయగలనని దర్శకుడు వశిష్ఠ నిరూపించుకున్నారు. మరి చిరంజీవితో సినిమా అంటే భారీ లెవెల్లో ఉంటాయి కదా. స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ సరసన నటించిన స్టార్ హీరోయిన్ త్రిష 16 ఏళ్ల తరువాత మళ్ళీ ఆయనతో నటిస్తున్నారు. కాగా ఇటీవలే త్రిష షూటింగ్ లో జాయిన్ అయ్యారు. త్రిషతో పాటు సురభి కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. జనవరి 10, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet