Swetha
Pushpa 2 Pre Release Event: పుష్ప 2 సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఈసినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. అసలే సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందంటే. ఇప్పుడు పుష్ప టీం కు కొత్త టెన్షన్ మొదలైంది. అదేంటో చూసేద్దాం.
Pushpa 2 Pre Release Event: పుష్ప 2 సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఈసినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. అసలే సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందంటే. ఇప్పుడు పుష్ప టీం కు కొత్త టెన్షన్ మొదలైంది. అదేంటో చూసేద్దాం.
Swetha
పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. తగ్గేదెలే అంటూ పుష్పరాజ్ దూసుకుపోతున్నాడు. దాదాపు మొన్న జరిగిన ప్రెస్ మీట్ తో సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసినట్లే. ఆ ప్రెస్ మీట్ లో అభిమానులకున్న డౌట్స్ అన్నీ తీరిపోయాయి. పైగా చెప్పిన టైం కంటే ఓ రోజు ముందే రిలీజ్ చేస్తామని ప్రామిస్ కూడా చేశారు. కానీ సినిమా షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉందని చెప్పారు. సరే మాట ఇచ్చారు కాబట్టి చెప్పిన టైం కు సినిమా వస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు అభిమానులు. కానీ ఎక్కడో ఓ దగ్గర షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అనే టెన్షన్ ఉంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ తో ఆ టెన్షన్ ఇంకాస్త పెరుగుతుంది. సాధారణంగా ఏ సినిమాకైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ , ఆడియో ఫంక్షన్స్ చాలా అవసరం. కనీసం సినిమా రిలీజ్ కు ఒక నెల రోజుల ముందు నుంచైనా ఈ హడావిడి మొదలవుతుంది.
కానీ ఇప్పడు పుష్ప 2 విషయంలో ఈ ఈవెంట్స్ జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో 144 సెక్షన్ ను విధించారు. ఒక నెల రోజుల పాటు హైదరాబాద్ లో ఎలాంటి సమావేశాలు , ర్యాలీలు జరగడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 వరకు హైదరాబాద్ లో ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అనుమతి లేకుండా సభలు , సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీనితో ఇప్పుడు పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు టెన్షన్ మొదలైంది. సభలు సమావేశాలకు పర్మిషన్ లేదని చెప్పారంటే.. అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా భాగం అని చెప్పొచ్చు . ఒకవేళ పర్మిషన్స్ లేకపోతే మాత్రం.. పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్ అయినట్లే.
ఈ సినిమా అటు చిత్ర బృందంతో పాటు.. ఇటు ప్రేక్షకులకు కూడా చాలా స్పెషల్. ఇలాంటి స్పెషల్ మూవీని ఈవెంట్స్ లేకుండా నేరుగా థియేటర్ రిలీజ్ అంటే మాత్రం .. ఫ్యాన్స్ కు నిరాశ తప్పదు. సో ఇలాంటి భారీ హైప్ ను మిస్ చేయకుండా.. ఫ్యాన్స్ ను హ్యాపీ చేయాలంటే మాత్రం.. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఈవెంట్స్ భారీగా నిర్వహించి క్రేజ్ ను క్యాచ్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ కూడా చాలా సింపుల్ గా వచ్చేస్తాయి. కాబట్టి అక్కడ ఈవెంట్స్ విషయంలో భయపడాల్సిన పని లేదు. అలాగే ఇక్కడ కూడా నవంబర్ 28 తో కర్ఫ్యూ ఎండ్ అవుతుంది. అప్పటికి సినిమా రిలీజ్ కు సరిగ్గా వారం రోజుల సమయం ఉంటుంది. అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తే కనుక హైదరాబాద్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి . మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.