iDreamPost
android-app
ios-app

Rashi Khanna: వారికి కూడా ఉరిశిక్ష వేయాలి.. రాశీఖన్నా డిమాండ్‌.. ఎవరికంటే

  • Published Jul 03, 2024 | 10:14 AM Updated Updated Jul 03, 2024 | 10:14 AM

New Criminal Laws: టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పాయల్‌ రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. వారికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్‌ చేసి.. అందరికి షాక్‌ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ వివరాలు..

New Criminal Laws: టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పాయల్‌ రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. వారికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్‌ చేసి.. అందరికి షాక్‌ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ వివరాలు..

  • Published Jul 03, 2024 | 10:14 AMUpdated Jul 03, 2024 | 10:14 AM
Rashi Khanna: వారికి కూడా ఉరిశిక్ష వేయాలి.. రాశీఖన్నా డిమాండ్‌.. ఎవరికంటే

సినిమాలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు.. సమాజంలో చోటు చేసుకునే ఘటనల మీద కూడా స్పందిస్తుంటారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా గ్లామర్‌ బ్యూటీ రాశీ ఖన్నా సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాల గురించి తప్ప.. ఇతర వేరే గురించి పెద్దగా స్పందించని రాశీ ఖన్నా తాజాగా.. సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేసింది. ఇంతకు రాశీ ఖన్నా ఎవరి గురించి ఇలా డిమాండ్‌ చేసింది.. అసలే జరిగిందంటే..

దేశంలో వందల ఏళ్లుగా ఉన్న బిటీష్‌ కాలం నాటి చట్టాలకు కాలం చెల్లింది. వాటి స్థనాంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టింది మోదీ సర్కార్‌. జూలై 2 అనగా మంగళవారం నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాల మీద దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే అత్యాచారాలకు సంబంధించి కొత్త చట్టాల్లో కీలక మార్పులు చేశారు. మైనర్ మీద అత్యాచారం చేసే వారికి ఉరి శిక్ష, గ్యాంగ్ రేప్ చేసిన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఎఫ్ఐఆర్‌ను అప్డేట్ చేయడం, ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద కొత్త సెక్షన్ ఇలా చాలా వరకు కొత్త రూల్స్‌ చేర్చారు.

Rashi khanna

వీటిపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇదే అంశంపై కామెంట్స్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇంతకు నెటిజనులు, సెలబ్రిటీలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న అంశం ఏదంటే.. గ్యాంగ్‌ రేప్‌ నిందితులకు విధించే శిక్షల అంశం. దీనిపై చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

వారి బాటలోనే.. కొత్త చట్టాల అమలు మీద టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా సైతం స్పందించారు. అత్యాచారాల కట్టడికి చేసిన చట్టాలు బాగున్నాయి అన్నారు. అయితే వీటిల్లో రెండోది అదే.. సామూహిక అత్యాచారం చేసిన వారికి విధించే శిక్ష సరిగా లేదని.. గ్యాంగ్‌ రేప్‌కి పాల్పడే వారికి కూడా ఉరిశిక్ష వేయాలని సామాన్యులతో పాటు పాయల్‌, రాశీ ఖన్నా సైతం డిమాండ్‌ చేస్తున్నారు. సామూహిక అత్యాచారం చేసే వాళ్లని కూడా వదలకూడదని, వారికి కూడా ఉరి శిక్ష విధించాలని కోరుతున్నారు. చాలా మంది నెటిజనులు వీరి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.

ఆ సంగతి అలా ఉంచి.. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్‌, రాశీఖన్నా ఇద్దరూ హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక రాశీ ఖన్నా రీసెంట్‌గా తమన్నాతో కలిసి బాక్‌ అంటూ థియేటర్లో ఆడియెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. ఈ బ్యూటీ కూడా బాలీవుడ్‌లో రాణించే ప్రయత్నాల్లో ఉంది.

jojobet girişmarsbahiscasibom