iDreamPost
android-app
ios-app

Devara: దేవర అదృష్టం మాములుగా లేదుగా! ఇక రికార్డ్స్ ఊచకోత పక్కా!

  • Published Sep 11, 2024 | 10:02 AM Updated Updated Sep 11, 2024 | 10:02 AM

Jr NTR, Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి అదృష్టం మామూలుగా లేదు.. ఇక రికార్డ్స్ ఊచకోత పక్కా అంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Jr NTR, Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి అదృష్టం మామూలుగా లేదు.. ఇక రికార్డ్స్ ఊచకోత పక్కా అంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Devara: దేవర అదృష్టం మాములుగా లేదుగా! ఇక రికార్డ్స్ ఊచకోత పక్కా!

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’తో ప్రేక్షకులను పిచ్చెక్కించడానికి సిద్ధం అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఒక వైపు మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలను షురూ చేశారు. ఇక విడుదలైన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. తారక్ యాక్షన్ కు ఆడియెన్స్ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దేవరకు అదృష్టం మామూలుగా లేదు.. రికార్డ్స్ ఊచకోత పక్కా అంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

దేవరతో రిలీజ్ కు ముందే తారక్ రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను విడుదలకు ముందే అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇక ఇప్పుడు రిలీజ్ తర్వాత మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను యంగ్ టైగర్ బద్దలు కొట్టబోతున్నాడు. దానికి కొన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. తారక్ సోలో రిలీజ్ ను సొంతం చేసుకోగా.. మరే మూవీ కూడా ఈ డేట్ కి రావడం లేదు. దాదాపు దసరా(అక్టోబర్ 12) వరకు ఎన్టీఆర్ కు తిరుగులేదనే చెప్పాలి. రెండు వారాలపాటు దేవర బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడం ఖాయం.

Devara Hunt starts

అయితే అక్టోబర్ 4న శ్రీవిష్ణు ‘స్వాగ్’, 10వ తారీఖున సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టయాన్’ వస్తున్నప్పటికీ.. దసరా హాలీడేస్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లెం. ఈ రెండు వారాలు గట్టిగా కొడితే.. తారక్ భారీ వసూళ్లను రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా దేవరపై ఉన్న అంచనాలు కూడా కలెక్షన్లను పెంచేందుకు తొడ్పడతాయి. ఇది తారక్ కు మంచి సమయం అని, రికార్డు వసూళ్లను సాధించడమే ఇక మిగిలి ఉందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దసరా లాంటి ఫెస్టివల్ కు తారక్ లాంటి స్టార్ హీరో వస్తే.. థియేటర్లు కళకళళాడుతాయి, బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవుతాయి. యంగ్ టైగర్ స్టామినాకు ఇంత మంచి సమయం దొరికితే ఊరుకుంటాడా? తన రేంజ్ ఏంటో చూపిస్తాడు. దేవర ఊచకోత స్టార్ట్ అవ్వబోతుందని, తారక్ వేటకు అడ్డు లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మిగిలిందల్లా.. తారక్ సృష్టించబోయే ప్రభంజనమే. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. పాటలు ప్రేక్షకుల గుండెల్లోకి చొచ్చుకెళ్లాయి. మరి మంచి టైమ్ లో విడుదల అవుతున్న దేవర మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş