సడెన్​గా ఓటీటీలోకి వచ్చిన రెజీనా లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే!

  • Author singhj Published - 09:45 PM, Fri - 22 September 23
  • Author singhj Published - 09:45 PM, Fri - 22 September 23
సడెన్​గా ఓటీటీలోకి వచ్చిన రెజీనా లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ అందులోనే!

రెజీనా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. దశాబ్ద కాలం నుంచి తన నటన ద్వారా ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేస్తున్నారీ ముద్దుగుమ్మ. 2005లో ‘కాంద నాల్ ముదాల్’ అనే తమిళ చిత్రంతో తెరంగేట్రం చేశారు రెజీనా. కానీ టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం చాలా టైమ్ తీసుకున్నారు. 2012లో వచ్చిన ‘శివ మనసులో శ్రుతి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమయ్యారు. ఇందులో శ్రుతి పాత్రలో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘కొత్త జంట’, ‘రారా కృష్ణయ్య’, ‘పవర్’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి హిట్స్​తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు రెజీనా. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ నటిస్తూ బిజీబిజీగా ఉన్నారామె.

కమర్షియల్ మూవీస్​తో పాటు అవకాశం దొరికినప్పుడు వైవిధ్యభరితమైన కథలతో ప్రయోగాలు చేస్తుంటారు రెజీనా. కథ, కథనాల్లో కొత్తదనం ఉంటే చాలు ఆమె ఓకే చెప్పేస్తుంటారు. అలాంటి రెజీనా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నేనే నా’. ఈ మూవీని కార్తీక్ రాజు డైరెక్ట్ చేశారు. రాజశేఖర్​ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో విడులైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో శుక్రవారం నుంచి రెజీనా లేటెస్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్​కు వచ్చింది.

మిస్టరీ కథాంశంతో రూపొందిన ‘నేనే నా’ సినిమాలో రెజీనా ఆర్కియాలజిస్ట్​గా నటించారు. ఇందులో ఆమె డ్యుయల్​ రోల్​లో కనిపించారు. యువరాణిగానూ, ఆర్కియాలజిస్ట్​గానూ ద్విపాతాభ్రినయం చేశారు రెజీనా. ఒక అడవిలో అనుమానాస్పదంగా చనిపోయిన ఒక విదేశీయుడి హత్య కేసులో ఆర్కియాలజిస్ట్ అయిన దివ్య (రెజీనా) సాయం తీసుకుంటారు. అయితే ఆ మర్డర్ చేసింది దివ్య రూపంలోనే ఉన్న దమయంతి (రెజీనా) అని పోలీసు ఇన్వెస్టిగేషన్​లో తేలుతుంది. ఆర్కియాలజిస్ట్ దివ్యకు, గత జన్మలో యువరాణి దమయంతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ మర్డర్ చేసింది ఎవరు? లాంటి వివరాలు తెలియాలంటే ‘నేనే నా’ మూవీని చూడాల్సిందే.

ఇదీ చదవండి: బాలకృష్ణ.. బాబు స్కాములపై చర్చకు వచ్చే దమ్ముందా?: మంత్రి రోజా

Show comments