iDreamPost
android-app
ios-app

NBK & BVS Ravi : సినిమా ఆఫర్ టాక్ షో ఎఫెక్టా

  • Published Mar 07, 2022 | 2:22 PM Updated Updated Mar 07, 2022 | 4:07 PM
  • Published Mar 07, 2022 | 2:22 PMUpdated Mar 07, 2022 | 4:07 PM
NBK & BVS Ravi : సినిమా ఆఫర్ టాక్ షో ఎఫెక్టా

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యిందని చెప్పేశారు కాబట్టి ఎప్పడు స్టార్ట్ అవుతుందో వేచి చూడటమే మిగిలింది. వీళ్ళవి కాగానే నెక్స్ట్ ఎవరితో అనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. పూరి జగన్నాథ్ పేరు వినిపించింది కానీ ఆయన లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు జనగణమన షూట్ లో విజయ్ దేవరకొండతో బిజీగా ఉన్నారు. సో ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే. స్వీయ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్ తీస్తానని ఆ మధ్య బాలయ్య అన్నారు కానీ అది కార్యరూపం దాల్చడం అనుమానమే.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం బివిఎస్ రవికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ టాక్ షో వ్యవహారాలు చూసింది ఈయనే. రైటర్ గా సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్న ఈయన దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యారు. గోపీచంద్ తో తీసిన వాంటెడ్ దారుణంగా డిజాస్టర్ కాగా సాయి ధరమ్ తేజ్ తో మంచి అంచనాలతో చేసిన జవాన్ కూడా చేదు ఫలితాన్ని అందుకుంది. మెగా ఫోన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారనే కామెంట్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య అవకాశం ఇవ్వడం విశేషం. కథ నచ్చితే చాలు డైరెక్టర్ ట్రాక్ రికార్డు పట్టించుకోని బాలకృష్ణకు రవి ఖచ్చితంగా హిట్ ఇవ్వాల్సిందే.

దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతుందట. యాభై సినిమాలు తీసినా తన బ్యానర్ లో బాలయ్య చేయలేదనే లోటుని ఈ రకంగా రాజుగారు తీర్చుకోబోతున్నారన్న మాట. అఫీషియల్ కాలేదు కాబట్టి ఇంతకన్నా డీటెయిల్స్ చెప్పలేం కానీ బివిఎస్ రవి చేతిలో బోలెడంత టైం ఉంది. నందమూరి హీరో ఇచ్చిన ఛాన్స్ ని పూర్తిగా వాడుకుని హిట్టు కొడితే మరిన్ని ఆఫర్లు వస్తాయి. ఎలాగూ దిల్ రాజు నిర్మాణం కాబట్టి బడ్జెట్ పరంగా పెద్దగా పరిమితులు ఉండవు. సో ఈ కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ కూడా త్వరలోనే మొదలుకానుంది

Also Read : Prabhas : తక్కువ సమయం ఎక్కువ లాభం సూత్రమిదే

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom