Venkateswarlu
హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అన్నపూరణి సినిమాపై కేసు పెట్టారు. దీంతో అన్నపూరణిని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ వెనక్కు తగ్గింది. సినిమాను తొలగించింది.
హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అన్నపూరణి సినిమాపై కేసు పెట్టారు. దీంతో అన్నపూరణిని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ వెనక్కు తగ్గింది. సినిమాను తొలగించింది.
Venkateswarlu
అన్నపూరణి సినిమా థియేటర్లలో విడుదలైన నాటి నుంచి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మూవీ హిందువుల మనో భావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ హిందూ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్నపూరణి ఓటీటీకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఉండింది. ఇక, అన్నపూరణి మూవీ హిందువుల మనోభావాలు దెబ్బ తీసేదిలా ఉందంటూ.. నయనతారతో పాటు ఈ చిత్ర నిర్మాతలు, దర్శకుడిపై కేసు నమోదైంది.
వివాదం నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ వెనక్కు తగ్గింది. అన్నపూరణి స్ట్రీమింగ్‌ను నిలిపి వేసింది. సినిమాను తెరకెక్కించిన జీ5 హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పింది. ఈ మేరకు ఓ లేఖను సైతం విడుదల చేసింది. తాజాగా చిత్ర హీరోయిన్ నయనతార కూడా ఈ వివాదంపై స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో .. ‘‘ అన్నపూరణి సినిమా విషయంలో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న సంఘటనల గురించి బరువెక్కిన గుండెతో ఈ లేఖను రాస్తున్నాను.
ఎంతో శ్రమకు ఓడ్చి అన్నపూరణిని సినిమాగా తీశాం. ఇందులో ఓ వ్యక్తి జీవితానికి అద్దం పడుతుంది. దృఢ సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నేర్చుకున్నాము. మేము ఎంతో పాజిటివ్‌గా ఈ మెసేజ్‌ను చెప్పాలనుకున్నాము. కానీ, ఈ ప్రయత్నంలో మేము మిమ్మల్ని బాధించి ఉండవచ్చు. సెన్సార్ చేసిన సినిమాను ఓటీటీ నుంచి తీసేయాల్సి వస్తుందని మేము ఊహించలేదు. నేను కానీ, నా టీం కానీ ఎవరినీ ఉద్దేశ్యపూర్వకంగా హర్ట్ చేయాలని అనుకోలేదు.
నాకు దేవుడి మీద ఎంతో నమ్మకం ఉంది. దేశం నలుమూలల ఉన్న దేవాయలకు తిరుగుతూ ఉంటాను. మీ భావాలకు ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించండి. స్పూర్తి నింపాలన్న ఉద్దేశ్యంతోనే అన్నపూరణి సినిమా తీశాం.. బాధపెట్టాలని. దాదాపు 20 ఏళ్లుగా నా జీవితం పాజిటివిటీ పంచడానికి.. ఇతరులనుంచి నేర్చుకుంటూ సాగుతోంది’’ అని పేర్కొన్నారు. మరి, అన్నపూరణి సినిమా విషయంలో నెలకొన్న వివాదంపై నయనతార స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Apologize Letter from Lady Superstar regarding #Annapoorani Controversy! pic.twitter.com/CNWFyX2ejn
— Christopher Kanagaraj (@Chrissuccess) January 18, 2024