Nagendra Kumar
హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అన్నపూరణి. అయితే, ఈ చిత్రం మత పరమైన వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో నయనతార సినిమా వివాదంపై క్షమాపణలు చెప్తూ.. లేఖ విడుదల చేసింది.
హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అన్నపూరణి. అయితే, ఈ చిత్రం మత పరమైన వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో నయనతార సినిమా వివాదంపై క్షమాపణలు చెప్తూ.. లేఖ విడుదల చేసింది.
Nagendra Kumar
నయనతార చుట్టూ కాంట్రవర్సీల వలయం చుట్టుకుంది. గతంలో నయన నటించిన అన్నపూరణి సినిమాకి సంబంధించి ఆమె హిందూ భక్తుల మనోభావాలను తన సినిమాలోని కొన్ని సీన్లు దెబ్బ తీసినందుకు తన ఇన్ స్టా నుంచి ఒక లేఖ ద్వారా క్షమాపణలు కోరింది. సాధారణంగా ఎంత భారీ చిత్రమైనా సరే.. పబ్లిసిటీ కేంపైన్ లో పాల్గొననని నిర్మాతలకు ఖరాఖండీగా చెప్పి, ఆ షరుతుతోనే అగ్రిమెంట్లపైన సంతకం చేసే రివాజున్న నయనతార.. ఇలా ఒక సినిమా ద్వారా పుట్టిన కాంట్రవర్సీకి సమాధానం చెప్పుకోవడం కాస్తంత ఆశ్చర్యకరమే. కానీ, నయనతారకి తప్పలేదు. ఎందుకంటే అన్నపూరిణ సినిమా ద్వారా జరిగిన గందరగోళం ఇంతా అంతా కాదు.
టూకీగా చెప్పాలంటే హిందూమత వ్యతిరేక వాదనలను కొన్ని సన్నివేశాలు ప్రతిబింబించిన నేపధ్యంలో.. అన్నపూరణి చిత్రం మీద అనేక హిందూ సంఘాలవారు ధ్వజమెత్తారు. హిందూ మతాన్ని వ్యతిరేకిస్తున్న సినిమాగా ఆయా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం అన్నపూరిణ సినిమాపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదైనంత స్థాయిలో కాంట్రవర్సీ చెలరేగింది. ఇది నిజానికి ఎవరూ ఊహించని సంఘటన. ధియేటర్లలో రిలీజ్ కావడానికి కావాల్సిన సదరు సెన్సార్ సర్టిఫికెట్ తోనే అన్నపూరణి ప్రేక్షకుల ముందుకొచ్చింది. తర్వాతనే నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి మీద ప్రదర్శితమైంది. కానీ కాంట్రవర్సీలు మొదలైన వెంటనే నెట్ ఫ్లిక్స్ ఆ సినిమాని ఓటిటి నుంచి తొలిగించివేసింది. ఇటువంటి సినిమాకి సెన్సార్ మరి ఎలా సర్టిఫికెట్ అందజేసిందో ఎవరికీ అర్ధం కాలేదు.
తన ప్రతిష్టకు భంగం కలుగుతుందనీ, లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుపోతాననే భయంతో నయనతార ముందస్తుగానే మేల్కొని క్షమాపణ లేఖను రిలీజ్ చేసి, జాగ్రత్త పడింది. పైగా ఆ సినిమాలో రాములవారి మహిమను కూడా అపహాస్యం చేసినట్టుగా ఉండడంతో, ప్రస్తుత దేశంలో నెలకొన్న రామ వాతావరణాన్ని మనసులో పెట్టుకుని నయనతార మెలకువను పాటించిందనే చెప్పాలి. అదీగాక, ఓం అనే ప్రణవాక్షరం ప్రింట్ చేసిన తన లెటర్ హెడ్ పైన జై శ్రీరామ్ అనే శీర్షికతో ఈ క్షమాపణ లేఖ రాయడం కూడా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
తాము ఎవరినీ కించపరచాలనే ఉద్దేశ్యంతో అన్నపూరిణ సినిమా చేయలేదని, ఒకటి అనుకుంటే అది ఇంకో విధంగా పరిణమించిందని నయన వాపోయింది లేఖలో. ఈ అంశంలో దాగున్న తీవ్రతను తాను అర్ధం చేసుకున్నానని, హిందూ దేవతలను ఆరాధించి, తరచూ గుళ్ళూగోపురాలకు వెళ్ళే భక్తుల మనోభావాలను.. తెలిసోతెలియకో గాయపరిచినందుకు తాను చాలా చింతిస్తున్నానని నయనతార తన ఆవేదనని వ్యక్తం చేసింది.