iDreamPost
android-app
ios-app

ఆగిన నవీన్ పోలిశెట్టి మూవీ.. ఇప్పుడు చేతులు మారిందట!

  • Author ajaykrishna Updated - 08:49 AM, Wed - 11 October 23
  • Author ajaykrishna Updated - 08:49 AM, Wed - 11 October 23
ఆగిన నవీన్ పోలిశెట్టి మూవీ.. ఇప్పుడు చేతులు మారిందట!

ఇండస్ట్రీలో కథలు ఓకే అయినప్పటి నుండి సినిమాలు తెరపైకి వచ్చే వరకు మధ్యలో ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ బయటికి తెలియకపోయినా.. ఏదొక టైమ్ లో అసలు నిజం ఏంటనేది బయటపడుతుంది. ఒక సినిమా ఓకే అయిపోయి మేకింగ్ దశలో ఉండగా.. ఆలస్యం అవుతూ వచ్చిందంటే ఖచ్చితంగా సినిమాపై ఉన్న పాజిటివ్ వైబ్ మెల్లగా పోతుంది. ఎందుకంటే.. ఒకానొక దశలో అసలు సినిమా వస్తుందా రాదా? అనేవరకు వెళ్తుంది. అలా అనుకున్న సినిమాలు ఒక్కసారిగా మళ్ళీ తెరపైకి వస్తున్నాయని తెలిస్తే.. ఇన్నాళ్లు రాదనుకున్న వారంతా ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి హీరోగా అనౌన్స్ మెంట్ అయిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా విషయంలో అదే జరుగుతుంది.

నవీన్ హీరోగా ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. నవీన్ నుండి నెక్స్ట్ ఏ సినిమా రాబోతుందా.. అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కానీ.. నవీన్ ఒకప్పుడు మొదలు పెట్టి.. ఆ తర్వాత ఎందుకో ఆగిపోయింది అనుకున్న మూవీ లైన్ లోకి వచ్చింది. ఇండస్ట్రీలో ఒక స్టేజి దాటిన తర్వాత సినిమాకు చేతులు మారుతుండటం అనేది మామూలే. కారణాలు ఏవైనా అప్పుడప్పుడు ఇలాంటివి వింటుంటాం. ఫలానా సినిమా ఫలానా నిర్మాత చేతికి వెళ్లిందని.. ఆ సినిమాలో హీరో మారాడని.. లేదా దర్శకుడు మారాడని వింటుంటాం.

ప్రస్తుతం నవీన్ నటించిన ‘అనగానగా ఒక రాజు’ సినిమా విషయంలో అదే జరిగిందని సమాచారం. ఈ సినిమా గతేడాది గ్రాండ్ గా అనౌన్స్ మెంట్ జరిగి.. కొంతవరకు షూటింగ్ అయ్యాక ఎందుకో ఆగిపోయింది. ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. సితార బ్యానర్ లో నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా.. మంచి బడ్జెట్ తో అనుకున్నారు. కట్ చేస్తే.. సినిమా ఆగి.. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కి ‘MAD’ మూవీ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. అనగనగా ఒక రాజు సినిమాకు దర్శకుడు మారాడట. కళ్యాణ్ శంకర్ స్థానంలో జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ లైన్ లోకి వచ్చాడని టాక్. ఇంకా అనౌన్స్ కాలేదు గానీ.. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వినికిడి. మరి జాతిరత్నాలుతో సూపర్ హిట్ కొట్టిన అనుదీప్, నవీన్ కాంబో మరోసారి ఆ హిట్ ఫార్ములా రిపీట్ చేస్తుందేమో చూడాలి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap