Venkateswarlu
డెవిల్ సినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవ్వనుంది.
డెవిల్ సినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవ్వనుంది.
Venkateswarlu
కల్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ డెవిల్’ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. అయితే, విడుదలకు కేవలం ఒక రోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. ఓ వివాదం తెరపైకి వచ్చింది. దర్శకుడి విషయంలో చర్చ మొదలైంది. ప్రముఖ దర్శకుడు నవీన్ మేడారం తానే డెవిల్ సినిమా దర్శకుడినని అంటున్నారు. అనుకోని కారణాల వల్ల మూవీనుంచి పక్కకు రావాల్సి వచ్చిందని తెలిపారు.
సినిమా టైటిల్స్ కార్డులో డైరెక్టర్‌గా తన పేరు వేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ డెవిల్ మూవీ కోసం నా జీవితంలోని మూడు సంవత్సరాలు కేటాయించాను. కథ దగ్గరినుంచి స్క్రీన్ ప్లే, దుస్తుల కోసం గుడ్డలు, లొకేషన్లు, సెట్స్ డిజైన్, సినిమాకు సంబంధించిన ప్రతీ విషయానికి నా వ్యక్తిగత అభిరుచిని జోడించాను. దాదాపు 105 రోజుల పాటు మూవీ షూటింగ్ చేశాను. కారైకుడి, వైజాగ్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశాను.
డెవిల్ కేవలం నా సృష్టి మాత్రమే. ఇది నాకు కేవలం ఓ ప్రాజెక్టు మాత్రమే కాదు. నా బిడ్డ కూడా. దాన్ని నేనే డైరెక్ట్ చేశాను. నా మౌనాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమా తీయటంలో నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఈగోలు, స్వార్థం వల్ల ఇదంతా జరిగింది. నేను ఎవ్వరి మీద లీగల్ చర్యలు తీసుకోవాలని అనుకోవటం లేదు. సినిమా క్రెడిట్స్‌లో దర్శకుడిగా నా పేరు రానందుకు బాధగా ఉంది. దీని కారణంగా అనుభవం, స్కీల్, కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను ప్రస్తుతం నా కెరీర్ మీదే దృష్టిపెడుతున్నాను. మరింత శక్తివంతంగా మీ ముందుకు వస్తాను. కల్యాణ్ రామ్ గారు సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.
100 శాతం ఎఫర్ట్స్ ఉంచారు. కల్యాణ్ రామ్ గారికి నా కృతజ్ఞతలు. విపత్కర పరిస్థితిలో నాకు అండగా నిలిచిన వారికి కూడా ధన్యవాదాలు. డెవిల్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. డిసెంబర్ 29, 2023న అందరూ సినిమాను థియేటర్లలో చూడండి. నేను కొత్త సినిమాకు సైన్ చేశాను. త్వరలో దాని వివారాలు ప్రకటిస్తాను. థాంక్యూ’’ అని రాసుకొచ్చాడు. కాగా, అభిషేక్ నామా ‘డెవిల్’ మూవీకి దర్శకత్వం వహించినట్లు తెలుస్తోంది. నిర్మాణ బాధ్యతలు కూడా ఆయనే చేపట్టారు. మరి, డెవిల్ సినిమా దర్శకుడ్ని తానే అంటూ నవీన్ మేడారం ఎమోషనల్ పోస్టు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.