iDreamPost
android-app
ios-app

ఆ OTTలోకి మళ్లీ పెళ్లి.. ఎప్పటి నుంచి స్ట్రీమిం​గ్‌ అంటే!

  • Published Jun 16, 2023 | 3:08 PM Updated Updated Nov 02, 2023 | 11:34 PM
  • Published Jun 16, 2023 | 3:08 PMUpdated Nov 02, 2023 | 11:34 PM
ఆ OTTలోకి మళ్లీ పెళ్లి.. ఎప్పటి నుంచి స్ట్రీమిం​గ్‌ అంటే!

టాలీవుడ్‌ సీనియర్‌ నటడు నరేష్‌, పవిత్రా లోకేష్‌ల చుట్టూ ఎన్ని వివాదాల నడిచాయో తెలుగు ప్రేక్షకులు ఇప్పట్లో మర్చి పోలేరు. నరేష్‌ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వడం, పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌.. దీని గురించి ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి. వీరి గొడవలు ఏకంగా కర్ణాటక వరకు వెళ్లాయి. కొన్ని రోజుల పాటు.. మీడియా, సోషల్‌ మీడియాలో వీరి గురించే జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో నరేష్‌, పవిత్రా లోకేష్‌, నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతిల మధ్య చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా మళ్లీ పెళ్ళి చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు నరేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. టీజర్స్‌, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా తీరా థియేటర్లలో రిలీజయ్యాక మాత్రం ఆశించిన మేర విజయం సాధించలేదు.

గత నెల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో ‍ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. నరేశ్‌, పవిత్రలకు ఉన్న ఫేమ్‌ దృష్ట్యా సుమారు రూ.2 కోట్లకు మళ్లీ పెళ్లి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా థియేటర్‌లో విడుదలై నెల రోజులు పూర్తి కావొస్తుండటంతో.. ఈ నెల 24 లేదా 25న ఈ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు కన్నడలోనూ ఒకేసారి ఈ మూవీని స్ట్రీమింగ్‌ చేయనున్నారు.

ఇక మళ్లీ పెళ్లి సినిమాలో జయసుధ, శరత్‌ బాబు, వనితా విజయ్‌ కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించారు. మరణించడానకిఇ ముందు శరత్‌ బాబు నటించిన చివరి చిత్రం ఇదే. వీరితోపాటు ఈ సినిమాలో అనన్య నాగళ్ల, అన్నపూర్ణ, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet