iDreamPost
android-app
ios-app

ఎంతో సింపుల్‌గా.. గుడిలో స్టార్‌ హీరో కుమార్తె వివాహం.. మోదీ ఆశీర్వాదం

  • Published Jan 17, 2024 | 4:01 PM Updated Updated Jan 17, 2024 | 4:01 PM

Suresh Gopi Daughter Wedding: ఆయనో పెద్ద స్టార్‌ హీరో.. పైగా రాజకీయ నాయకుడు కూడా. అలాంటి వ్యక్తి.. ఆయన కుమార్తె వివాహాన్ని ఎంతో నిరాడంబరంగా ఆలయంలో జరిపించారు. ఆ వివరాలు..

Suresh Gopi Daughter Wedding: ఆయనో పెద్ద స్టార్‌ హీరో.. పైగా రాజకీయ నాయకుడు కూడా. అలాంటి వ్యక్తి.. ఆయన కుమార్తె వివాహాన్ని ఎంతో నిరాడంబరంగా ఆలయంలో జరిపించారు. ఆ వివరాలు..

  • Published Jan 17, 2024 | 4:01 PMUpdated Jan 17, 2024 | 4:01 PM
ఎంతో సింపుల్‌గా.. గుడిలో స్టార్‌ హీరో కుమార్తె వివాహం.. మోదీ ఆశీర్వాదం

ఈరోజుల్లో సామాన్యుల ఇండ్లలో పెళ్లి అంటేనే లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇక ఆర్థికంగా బాగా ఉన్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంగీత్‌, మెహందీ, వివాహం, రిసెప్షన్‌ వంటి కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక సెలబ్రిటీల వివాహాలు అంటే.. ఆ ఖర్చు, వైభవం, హంగు, ఆర్భాటం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి కోసం డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ అనే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతూ.. మీడియా, హడావుడి వీటన్నింటికి దూరంగా విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్నారు. స్టార్‌ హీరోలు, హీరోయిన్ల పిల్లల పెళ్లిల్లు కూడా ఇంతే ఘనంగా జరుగుతాయి. కానీ తాజాగా ఓ స్టార్‌ హీరో కుమార్తె పెళ్లి మాత్రం ఇందుకు భిన్నంగా ఎంతో సింపుల్‌గా గుడిలో జరిగింది. ఆ వివరాలు..

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్‌ గోపీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె భాగ్య సురేశ్‌ వివాహం తాజాగా జరిగింది. శ్రేయాస్‌ మోహన్‌తో కలిసి ఆమె ఏడడుగులు వేసింది. వీరి వివాహం జనవరి 17 అనగా బుధవారం నాడు ఉదయం కేరళలోని గురువాయూర్‌ ఆలయంలో ఎంతో సింపుల్‌గా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం అంటే.. ఈ వివాహ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

30 జంటలను ఆశీర్వదించిన మోదీ..

సురేశ్‌ గోపి కుమార్తె వివాహానికి హాజరైన మోదీ.. ఈ సందర్భంగా అక్కడున్న అందరినీ చిరునవ్వుతో పలకరించారు. అనంతరం తన చేతుల మీదుగా నూతన వధూవరులు పూలదండలు మార్చుకునే కార్యక్రమాన్ని జరిపించారు మోదీ. తర్వాత కొత్త జంట.. తమను ఆశీర్వదించండంటూ మోదీ పాదాలకు నమస్కరించింది. వీరితో పాటు అదే ఆలయంలో పెళ్లి చేసుకున్న మరో 30 కొత్త జంటలను ఆశీర్వదించారు ప్రధాని మోదీ.

స్టార్‌ సెలబ్రిటీల సందడి..

సురేష్‌ గోపి కుమార్తె సందర్భంగా సినీతారలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌, దిలీప్‌, ఖుష్బూ, జయరాం తదితర సెలబ్రిటీలు కుటుంబంతో సహా విచ్చేసి ఈ పెళ్లి మండపంలో సందడి చేశారు. సురేశ్‌ గోపి కూతురి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్‌ హీరో అయినప్పటికి.. తన కుమార్తె వివాహాన్ని ఎంతో సింపుల్‌గా నిర్వహించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş