iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు గురి పెట్టిన నాని.. పెద్ద స్కెచ్ ఏ ఇది

  • Published Oct 17, 2024 | 4:02 PM Updated Updated Oct 17, 2024 | 4:02 PM

ఒక్కో మెట్టు ఎక్కుతూ నాని కూడా స్టార్ హీరోల లిస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇక ఇప్పుడు నాని పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాడు. అందుకోసం నాని ఇప్పుడు పెద్ద స్కెచ్ ఏ వేసాడు. అదేంటో చూసేద్దాం.

ఒక్కో మెట్టు ఎక్కుతూ నాని కూడా స్టార్ హీరోల లిస్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇక ఇప్పుడు నాని పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాడు. అందుకోసం నాని ఇప్పుడు పెద్ద స్కెచ్ ఏ వేసాడు. అదేంటో చూసేద్దాం.

  • Published Oct 17, 2024 | 4:02 PMUpdated Oct 17, 2024 | 4:02 PM
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు గురి పెట్టిన నాని.. పెద్ద స్కెచ్ ఏ ఇది

అసలే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లాస్ లో ఉంది. దీనితో తెలుగు హీరోలు దానికి ప్రాణం పోస్తున్నారు. పాన్ ఇండియా స్టార్లు అక్కడ థియేటర్స్ కు కళ తెప్పిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేస్తున్నారు. ఈ దండయాత్ర ఇప్పట్లో ఆగదు. ఎందుకంటే ఆల్రెడీ బడా హీరోలు బడా దర్శకులతో పక్కా ప్లానింగ్ తో రెడీ గా ఉన్నారు. అలా లైన్ అప్ లో ఉన్న సినిమాలేంటో కూడా తెలియనిది కాదు. ఈ సినిమాలే బాలీవుడ్ ను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదంటే.. ఇప్పడు ఈ లిస్ట్ లోకి మరో హీరో ఎంటర్ అయ్యాడు. ఏకంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కే గురి పెట్టాడు. ఆ హీరో మరెవరో కాదు .. న్యాచురల్ స్టార్ నాని. ఒక్కో మెట్టు ఎదుగుతూ అందరి మెప్పు పొందాడు నాని. ప్రతి కొత్త దర్శకుడిని ఎంకరేజ్ చేయడంలో నాని ఎప్పుడు ముందుంటాడు. అతని పక్కింటి అబ్బాయిల కనిపించే లుక్స్ , వైవిధ్య భరితమైన నటన, అతని సహజ స్వభావం ఒక సాధారణ నానిని.. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానిగా మార్చేశాయి.

ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు నాని. ఈ క్రమంలోనే ఇప్పుడు నాని పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాడు. దానికి కోసం పెద్ద స్కెచ్ ఏ వేసాడు. అది కూడా దసరా మూవీతో దర్శకుడిగా మారిన శ్రీకాంత్ ఓడేలాతో. పేరుకే కొత్త దర్శకులు. కానీ వారిని నమ్మి సినిమా తీస్తే మొదటి సినిమాతో నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ బుచ్చిబాబు చేసింది అదే. ఇప్పుడు ఆ దర్శకుడు ఏకంగా గ్లోబల్ స్టార్ నే పట్టేసాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బుచ్చి బాబు.. రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు. దానికోసం పక్కా ప్లానింగ్ ను రెడీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు దసరాతో దర్శకుడిగా మారిన శ్రీకాంత్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో హద్దులు చెరిగిపోయాయి. ఎన్నో రకాల క్రేజి కాంబినేషన్ లో సినిమాలను చూస్తున్నాం. తెలుగు సినిమాల దగ్గరకు వచ్చే సరికి ఈ కాంబినేషన్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి.

అలా బాలీవుడ్ భామలు కూడా తెలుగులో వర్క్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్ , నోరా ఫతేహి లాంటి సెన్సేషనల్ హీరోయిన్స్ తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. వీరికంటే ముందు ఇంకెంతో మంది హీరోయిన్స్ తెలుగులో నటించి మంచి ఫేమ్ దక్కించుకుంటున్నారు. వారిలో ఒకరు బాలీవుడ్ లో ఇటీవల సంచలన విజయం సాధించిన యంగ్ బ్యూటీ శ్రద్ధ కపూర్. రీసెంట్ గా వచ్చిన స్త్రీ 2 మూవీ హిందీలో ఏకంగా 860కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కొత్త ట్రాక్ రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు ఈ హీరోయిన్ ను దర్శకులు లైన్లో పెట్టారట. అది కూడా మోస్ట్ ప్రాఫిటబుల్ యంగ్ హీరో.. న్యాచురల్ స్టార్ నానికి జోడిగా. రీసెంట్ గా నాని నటించిన సరిపోదా శనివారం సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ కనుక వర్కౌట్ అయితే.. పాన్ ఇండియా లెవెల్లో అది మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet