iDreamPost
android-app
ios-app

అర్షద్‌ మంచి నటుడు.. నేను అలా అనకుండా ఉండాల్సింది: హీరో నాని

  • Published Aug 23, 2024 | 1:39 PM Updated Updated Aug 23, 2024 | 1:39 PM

Arshad Warsi-Nani: అర్షద్ వార్సీ మంచి నటుడు, అతడిని దేశం మెుత్తం ఇష్టపడుతుంది. నేను అతడిని అలా అనకుండా ఉండాల్సింది అంటూ న్యాచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Arshad Warsi-Nani: అర్షద్ వార్సీ మంచి నటుడు, అతడిని దేశం మెుత్తం ఇష్టపడుతుంది. నేను అతడిని అలా అనకుండా ఉండాల్సింది అంటూ న్యాచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 23, 2024 | 1:39 PMUpdated Aug 23, 2024 | 1:39 PM
అర్షద్‌ మంచి నటుడు.. నేను అలా అనకుండా ఉండాల్సింది: హీరో నాని

అర్షద్ వార్సీ.. ప్రస్తుతం ఈ పేరు ఇండియా వైడ్ గా వార్తల్లో వినిపిస్తోంది. దానికి కారణం అతడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై చేసిన కామెంట్సే. కల్కి మూవీలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉంది అంటూ ఈ బాలీవుడ్ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం పెద్ద ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై ఇటీవలే స్పందిస్తూ.. అర్షద్ వార్సీపై నాని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ కూడా వైరల్ గా మారాడంతో.. తన కామెంట్ కు చింతిస్తున్నాను అంటూ తాజాగా చెప్పుకొచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. అసలు ఏం జరిగిందంటే?

ప్రభాస్ పై కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీపై ఇటీవల కామెంట్స్ చేశాడు నాని. అర్షద్ కు ఎన్నడూ రానంత క్రేజ్ ఈ కామెంట్ వల్ల వచ్చిందని నాని అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు చేసినందుకు తాను చింతిస్తున్నానని తెలిపాడు. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన నాని అర్షద్ పై చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నానని చెప్పుకొచ్చాడు. నాని మాట్లాడుతూ..

Naani

“అర్షద్ అద్భుతమైన నటుడు. ‘మున్నాభాయ్’ నుంచి ఆయనంటే మాకెంతో ఇష్టం. సౌత్, నార్త్ అని కాదు.. ఇండియా మెుత్తం ఆయన అంటే ఇష్టపడుతుంది. అయితే నటులుగా ఉన్నప్పుడు తాము మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలా చేయకపోవడం వల్లే మేమిద్దరం బాధితులం అయ్యాం. ప్రభాస్ గురించి అతడు మాట్లాడిన మాటలు ఎలా వైరల్ అయ్యాయో.. నేను అతడిపై చేసిన కామెంట్స్ కూడా అలాగే అయ్యాయి. మనం ఎంతో ఇష్టపడే వారి గురించి ఇలాంటి సంభాషణ వస్తే.. “అనవసరమైన విషయానికి మనం ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని కామన్ గా అంటాం. నేను కూడా అలానే అన్నాను. ఇక నా కామెంట్స్ పై వచ్చిన రియాక్షన్స్ చూసిన తర్వాత అర్షద్ ఫుల్ ఇంటర్వ్యూ చూశాను. మీడియా, సోషల్ మీడియా అతడి వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించిందని అర్ధమైంది. దాంతో పాటుగా నా కామెంట్స్ కూడా మరోవిధంగా జనాల్లోకి వెళ్లాయి. అర్షద్ మంచి నటుడు నేను అలా అనకుండా ఉండాల్సింది” అని నాని చెప్పుకొచ్చాడు. ఇక నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş