iDreamPost
android-app
ios-app

నాని పిల్లజమీందార్ మూవీ నటి గుర్తుందా..? ఆ ఇండస్ట్రీలో టాప్ రేంజ్

  • Published Aug 21, 2024 | 5:54 PM Updated Updated Aug 21, 2024 | 5:54 PM

కథల ఎంపికలో కొత్తథనం కోరుకునే హీరోల్లో ఒకరు నాని. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తుంటాడు. అలా డిఫరెంట్ రోల్ చేసిన మూవీ పిల్లజమీందార్. ఇందులో ఇగో నానిగా కనిపిస్తాడు. ఇందులో అతడి సరసన నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..? ఆ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ అని తెలుసా..?

కథల ఎంపికలో కొత్తథనం కోరుకునే హీరోల్లో ఒకరు నాని. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తుంటాడు. అలా డిఫరెంట్ రోల్ చేసిన మూవీ పిల్లజమీందార్. ఇందులో ఇగో నానిగా కనిపిస్తాడు. ఇందులో అతడి సరసన నటించిన యాక్ట్రెస్ గుర్తుందా..? ఆ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ అని తెలుసా..?

  • Published Aug 21, 2024 | 5:54 PMUpdated Aug 21, 2024 | 5:54 PM
నాని పిల్లజమీందార్ మూవీ నటి గుర్తుందా..? ఆ ఇండస్ట్రీలో టాప్ రేంజ్

పరాయి ఇండస్ట్రీల నటీమణులకు తెలుగు ఇండస్ట్రీ స్వర్గధామంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలీవుడ్, మాలీవుడ్ మాత్రమే కాదు శాండిల్ వుడ్ ముద్దుగుమ్మలకు కూడా టాలీవుడ్డే కావాలి. తమ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే మరింత ఫేమ్ అయ్యేందుకు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంటారు. సక్సెస్ అవ్వగానే మాయం అయిపోతుంటారు. ఇదిగో ఈ భామ కూడా మెరుపు తీగలా వచ్చి.. తన నటనతో మైమరిచేలా చేసి.. అంతలోనే తిరిగి తన స్థావరానికి (కన్నడ ఇండస్ట్రీ)కి వెళ్లిపోయింది. నాని, బాలకృష్ణ వంటి స్టార్ సరసన నటించి ఇప్పడు శాండిల్ వుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరంటే.. హరిప్రియ. పిల్ల జమీందార్ చిత్రంలో సింధు పాత్రలో పదాహరణాల తెలుగు అమ్మాయి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏం చేస్తుందీ, ఎక్కడుందో తెలుసా…?

చిక్కబళ్లాపూర్‌లో పుట్టిన హరి ప్రియ అసలు పరు శృతి చంద్ర సేన. స్కూలింగ్ పూర్తయ్యాక.. భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. అలా ప్రోగ్రామ్స్ ఇస్తుండగా.. డైరెక్టర్ రిచర్ట్ స్టిల్స్ చూసి తన తీయబోయే తుళు మూవీకి ఆఫర్ చేశాడు. ఆమె సినిమాల కోసమని బెంగళూరు షిఫ్ట్ అయ్యింది. బడి అనే తుళు మూవీతో సినీ తెరంగేట్రం చేసింది ఈ చిన్నది. వరుస పెట్టి కన్నడలో సినిమాలు చేసింది. దీంతో ఆమెకు కన్నడ బ్యూటీ అని, శాండిల్ బ్యూటీ క్వీన్ అంటూ నిక్ నేమ్స్ వచ్చి చేరాయి. భూమికా చావ్లా భర్త భరత్ ఠాకూర్ నిర్మాతగా వ్యవహరించిన తకిత తకిట మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఓకే అనిపించుకుంది. ఇది తమిళంలో కూడా డబ్ చేయడంతో తెలుగు కన్నా అక్కడ ఆమెకు ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. 2011లో నాని హీరోగా చేసిన పిల్ల జమీందార్ మూవీలో నటించి మెప్పించింది. నానిని అమితంగా ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తుంది.

ఈ సినిమా హిట్ కొట్టినప్పటికీ.. కన్నడ ఆఫర్స్ రావడంతో అక్కడకు వెళ్లిపోయింది. ఆ తర్వాత తెలుగులో వరుణ్ సందేశ్‌తో వరుసగా రెండు చిత్రాల్లో నటించింది. అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల్లో యాక్ట్ చేసింది. సలార్ మూవీ ఒరిజినల్, ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసింది. ఈ సినిమా హిట్టుతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆమె తెలుగులో చేసిన చివరి చిత్రం బాలకృష్ణ జై సింహ. మంగ పాత్రలో నవ్వించింది హరి ప్రియ. సుమారు 30 పైగా చిత్రాల్లో నటించింది ఆమె. బెల్ బోటమ్, కురక్షేత్ర, పెట్రోమాక్స్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగుప్రాజెక్టులు ఉన్నాయి. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కన్నడ నటుడు వశిష్టను వివాహం చేసుకుంది. అలాగే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. హరిప్రియ క్రియేషన్స్ పేరుతో షార్ట్ ఫిల్మ్ నిర్మించేందుకు రెడీ అయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Hariprriya Simha (@iamhariprriya)

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetturka girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom