iDreamPost
android-app
ios-app

పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్న నాచురల్ స్టార్ నాని

  • Published Feb 09, 2024 | 2:57 PM Updated Updated Feb 09, 2024 | 2:57 PM

న్యాచురల్ స్టార్ వరుస సినిమాలను లైనులో పెడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న తర్వాత ఢిపరెంట్ రోల్స్ చేస్తున్నాడు. అందులో ఒకటి శనిపోదా శనివారం. టైటిలే ఇంత వెరైటీగా ఉందో కదూ.. ఇప్పుడు మరో రెండు సినిమాలు..

న్యాచురల్ స్టార్ వరుస సినిమాలను లైనులో పెడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న తర్వాత ఢిపరెంట్ రోల్స్ చేస్తున్నాడు. అందులో ఒకటి శనిపోదా శనివారం. టైటిలే ఇంత వెరైటీగా ఉందో కదూ.. ఇప్పుడు మరో రెండు సినిమాలు..

  • Published Feb 09, 2024 | 2:57 PMUpdated Feb 09, 2024 | 2:57 PM
పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్న నాచురల్ స్టార్ నాని

అభిమానుల చేత నాచురల్ స్టార్ అని పిలిపించుకుంటున్న నాని తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు తను ఇప్పటి వరకూ చేసిన సినిమాలు చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. గత వేసవిలో దసరా వంటి మాస్ యాక్షన్ డ్రామా తర్వాత హాయ్ నాన్న అనే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇప్పుడు దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనౌన్స్ మెంట్ వీడియో తోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించింది.

నిజానికి వివేక్ ఆత్రేయతో నాని తీసిన ‘అంటే సుందరానికి’ సినిమా అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అయినప్పటికీ కథ మీద నమ్మకంతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు నాని. కాగా ఈ చిత్రం పూర్తయిన తర్వాత నాని బలగం ఫేమ్ వేణుతో సినిమా చేయనున్నారు. కమెడియన్ వేణు, దర్శకుడిగా మారి బలగం సినిమా తెరకెక్కించి.. చాలా ప్రశంసలు అందుకున్నారు. తన తదుపరి సినిమా నానితో అన్న వార్త వినగానే అంచనాలు భారీగా పెరిగి పోయాయి. వేణుతో పాటు యువ దర్శకుడు సుజీత్‌తో కూడా నాని ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది.

సుజీత్ సినిమా స్టైలిష్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. వేణు తో చేసే సినిమా బలగం లాగే పల్లెటూరి వాతావరణంలో ఉండే అవకాశం ఉంది. ఇలా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు ఏదో ఒక కొత్తదనాన్ని అందిస్తూ నాని కెరీర్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సరిపోదా శనివారం సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకున్నట్టు నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఇది రెండో చిత్రం. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా, ఎస్ జే సూర్య విలన్‌గా కనిపించనున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio