iDreamPost
android-app
ios-app

Nani: ‘హాయ్ నాన్న’తో నాని ఆశలు నిజమవుతాయా?

  • Published Dec 05, 2023 | 9:37 PM Updated Updated Dec 05, 2023 | 9:37 PM

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. మరి ఈ మూవీతో నాని ఆశలు తీరుతాయా?

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా నటించిన చిత్రం 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. మరి ఈ మూవీతో నాని ఆశలు తీరుతాయా?

Nani: ‘హాయ్ నాన్న’తో నాని ఆశలు నిజమవుతాయా?

నాని ఏం చేసినా దానికో క్రేజ్ ఏర్పడుతుంది. అందుకు కారణం లేకపోలేదు. ఎవ్వరూ చేయని సాహసాలు అతడు చేస్తుంటాడు. చిన్న లైన్ ని తీసుకుని, దానికి ఇంట్రస్టింగ్ నెరేషన్ ని జోడించి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మార్కులు కొట్టేస్తుంటాడు ఈ న్యాచురల్ స్టార్. హీరోగా ఆ రికార్డును మాత్రం వదులుకోడు. రిస్క్ అయినా సరే వెనుకాడడు. అదీ నాని మార్క్. గతంలో ఆయన చేసిన ఏ సినిమా అయినా సరే ఇందుకు నిదర్శనమే. ఇటీవలే వచ్చిన దసరా మూవీ చేయడం నిజంగా సాహసమే. అటువంటి వెరైటీ కథలను నాని చేయడం అవి ప్రేక్షకాదరణ పొందడం ఆనవాయితీ అయిపోయింది.

ఇక అలాగని సినిమా గురించి పెద్దగా వల్లించడు కూడా నాని. అంతా సస్పెన్స్ లా మాట్లాడి, ఆ షాక్ వేల్యూని కాపాడతాడు. ఇప్పడు రిలీజ్ అవుతున్న్ హాయ్…నాన్న చిత్రం కూడా అంతే. ఈ మూవీకి చిన్నపిల్లే ప్రధానపాత్రలా కనిపిస్తుంది. విడిపోయిన వైఫ్ అండ్ హజ్బెండ్, తండ్రి దగ్గర ఉండిపోయిన కూతురు.. ఇలా ఏదో అనిపిస్తుంది టీజర్ చూస్తే. ఆ రోజు కూడా మీడియా అడిగిన ప్రశ్నలకు నాని ఎక్కడా ఏ క్లూ లేకుండా మాట్లాడి, టీజర్ రిలీజ్ డే నాడు అందరినీ టీజ్ చేసి వదిలేశాడు. నాని కమిట్మెంట్ ని కాదనలేం. డెడికేషన్ ని అంతకన్నా ప్రశ్నించలేం. కాకపోతే ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న చర్చ అంతా ఈ హాయ్ నాన్న సినిమా కథమీదే.

హాయ్ నాన్న కథ బాగా సున్నితమైన లైన్. సెన్సిటివ్ ఎమోషన్స్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. యానిమల్ లాంటి సినిమాలు దుమ్ము లేపుతున్న సమయంలో ఇటువంటి డెలికేట్ లైన్ సినిమాలను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ఇప్పుడు పెద్ద చర్చ. ఇదేం పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ కానే కాదు. కాకపోతే రన్ లో ఉన్న ఓ పెద్ద హీరో సినిమా మిస్ ఫైర్ అయితే దాని ప్రభావం పరిశ్రమ మీద, క్యూలో ఉన్న నిర్మాతల మీద తప్పకుండా పడుతుందనే భయం అందరిలో ఉంది. అయితే నానికున్న దైర్యం అందరికీ ఉండదుగా. పైగా దసరా చిత్రం కూడా రెవిన్యూ పరంగా పెద్దగా నిర్మాతకి ఆటవిడుపు కాదన్న విమర్శ లోలోపల ఉంది.

అంతకు ముందు వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ అన్నారు. వీటిని నాని టీజర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో కొట్టిపారేశాడనుకోండి. కానీ, నిజాలు నిజాలే కదా. దీనికి తోడు  అతడికున్నంత ఫాలోయింగ్, గ్లామర్ లేకపోవచ్చు గానీ, సిద్ధార్ధ్ కి కూడా ఎంతో కొంత గుడ్ విల్ ఉందన్న మాటైతే వాస్తవం. సిద్ధార్ధ్ చేసిన చిన్నా కూడా దెబ్బయిపోయింది. అది కూడా చిన్నపిల్ల మీద కథే కావడం ఇక్కడ గమనార్హం. కాకపోతే హాయ్ నాన్నలో పాటలు కొన్ని బాగా పట్టేశాయి. ఫీల్ కనిపిస్తోంది. నాని నటించి, మెప్పించగలడు. పైగా మృణాల్ ఠాకూర్ అదనపు ఆకర్షన. దీంతో ఫాలోయింగ్ దానిని మరింత రెట్టింపు చేసే అవకాశమైతే ఉందిక్కడ. వీటన్నిటి నేపథ్యంలో హాయ్.. నాన్న హై అలర్ట్ లోనే డిసెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది. చూడాలి నాని ఆశలు నిజమవుతాయా? లేదా? అని.

                                                                                                                             -నాగేంద్ర కుమార్