iDreamPost
android-app
ios-app

Raj Tarun: హీరో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్న పోలీసులు! కేసు పూర్తి వివరాలు ఇవే..

  • Published Sep 06, 2024 | 1:41 PM Updated Updated Sep 06, 2024 | 1:41 PM

Charge Sheet Against Raj Tarun In Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే రాజ్ తరుణ్ ను నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.

Charge Sheet Against Raj Tarun In Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే రాజ్ తరుణ్ ను నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.

Raj Tarun: హీరో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా పేర్కొన్న పోలీసులు! కేసు పూర్తి వివరాలు ఇవే..

హీరో రాజ్‌తరుణ్-లావణ్య వివాదం గురించి అందరికి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం.. ఈ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. తాజాగా ఈ కేసుకు సంబంధించి.. పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. దాంతో అతడికి ఈ కేసులో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది. ఇక పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. విచారణలో భాగంగా లావణ్య ఇంట్లో సాక్ష్యాలను సేకరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజ్ తరుణ్-లావణ్య వివాదం.. టాలీవుడ్ ను షేక్ చేసింది. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, తనకు అబార్షన్ కూడా చేయించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక అప్పటి నుంచి మెుదలైన ఈ కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా.. తాజాగా ఉప్పరపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాంతో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా లావణ్య ఇంట్లో సాక్ష్యాలను సేకరించారు పోలీసులు. అనంతరం ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

పోలీసులు ఛార్జ్ షీట్ లో ఈ విధంగా పేర్కొన్నారు..”రాజ్ తరుణ్ లావణ్యతో 10 ఏళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు విచారణలో తేలింది. ఆ పదేళ్లు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. లావణ్య చెబుతున్న దాంట్లో నిజాలు ఉన్నాయి. ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించిన తర్వాతే రాజ్ తరుణ్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చాము”  అని పోలీసులు తెలిపారు. కాగా.. ఇక ఈ కేసులో అతడు ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. లావణ్య వ్యవహారంలో రాజ్ తరుణ్ ను  నిందితుడిగా చేర్చడంతో అతడికి బిగ్ షాక్ తగిలింది. మరి ఈ విషయంలో అతడు ఏ విధంగా ముందుకెళ్తాడో వేచి చూడాలి.