iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ మూవీకి నో చెప్పిన నాని! కారణం బలమైందే..

  • Published Jul 11, 2024 | 6:04 PM Updated Updated Jul 11, 2024 | 6:04 PM

Rajanikanth-Nani-Fahadh Faasil: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. కానీ న్యాచురల్ స్టార్ నాని, ఫహద్ ఫాజిల్ ఇద్దరూ రజినీ మూవీకి నో చెప్పారట. అయితే వారు నో చెప్పడానికి ఓ బలమైన కారణం కూడా ఉందట. ఆ వివరాల్లోకి వెళితే..

Rajanikanth-Nani-Fahadh Faasil: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. కానీ న్యాచురల్ స్టార్ నాని, ఫహద్ ఫాజిల్ ఇద్దరూ రజినీ మూవీకి నో చెప్పారట. అయితే వారు నో చెప్పడానికి ఓ బలమైన కారణం కూడా ఉందట. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 11, 2024 | 6:04 PMUpdated Jul 11, 2024 | 6:04 PM
రజినీకాంత్ మూవీకి నో చెప్పిన నాని! కారణం బలమైందే..

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ లెజెండ్. అంతకంటే ఎక్కువగా ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అందరి ప్రేమను పొందుతున్నాడు. ఇక తన స్టైల్ తో వరల్డ్ వైడ్ గా అభిమానగణాన్ని సృష్టించుకున్నాడు తలైవా. సూపర్ స్టార్ మూవీలో ఒక్క ఛాన్స్ వస్తే నటించాలని ఎంతో మంది స్టార్స్ ఎదురుచూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది రజినీ మూవీలో ఛాన్స్ వస్తే ఎగిరి గత్తేస్తారు కానీ.. నో చెబుతారా? కానీ ఇద్దరు స్టార్స్ రజినీ మూవీలో నటించడానికి నో చెప్పారంటే మీరు నమ్ముతారా? ఆ ఇద్దరిలో ఒకరు న్యాచురల్ స్టార్ నాని కాగా.. మరోకరు ఫాహద్ ఫజిల్. అయితే వీరిద్దరు సూపర్ స్టార్ మూవీకి నో చెప్పడానికి బలమైన కారణమే ఉందట.

లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కూలీ మూవీలో ఓ కీలక పాత్రను ఫహద్ కు ఆఫర్ చేశారట. కానీ దాన్ని అతడు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే? రజినీ మరో మూవీ ‘వెట్టాయన్’లో ఫహద్ ఓ సాలిడ్ రోల్ పోషిస్తున్నాడు. దాని కంటే తక్కువ స్థాయి పాత్రకు కూలీలో అడగడంతో.. వద్దనుకున్నాడట పుష్ప విలన్.

ఇదిలా ఉండగా.. ‘వెట్టాయన్’ మూవీ క్యాస్టింగ్ జరుగుతున్న సమయంలో న్యాచురల్ స్టార్ నానిని ఓ కీలక పాత్ర చేయాల్సిందిగా మేకర్స్ అప్రోచ్ అయ్యారట. కానీ ఆ పాత్ర అంత ప్రాధాన్యత అనిపించకపోవడంతో.. సూపర్ స్టార్ మూవీని తిరస్కరించాడట నాని. దాంతో ఆ పాత్ర కాస్త దగ్గుబాటి రానా దగ్గరికి వెళ్లింది. సో.. అటు ఫహద్ ఫాజిల్, ఇటు నాని పాత్రకు ప్రాముఖ్యం లేదన్న ఒకే రీజన్ తో సూపర్ స్టార్ మూవీని వదులుకున్నారన్నమాట. అయితే ఈ వార్తలు అధికారికంగా మేకర్స్ చెప్పనప్పటికీ.. ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీపావళి కానుకగా వెట్టాయాన్ రెడీ అవుతుండగా.. వచ్చే వేసవికి కూలీని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş